Nizamabad Floods : నిజామాబాద్​ జిల్లా జలమయం...ఫొటో ఫీచర్

by Sridhar Babu |   ( Updated:2023-07-27 10:26:56.0  )

దిశ, నెట్‌వర్క్ : ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. చెరువులు, కుంటలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దాంతో పలు చోట్ల ప్రాజెక్టుల గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పలు గ్రామాలను వరద ముంచెత్తింది. రహదారులు, పంట పొలాలు వరద నీటిలో మునిగిపోయాయి. వాగులు, చెరువులు పొంగిపొర్లడంతో పలు గ్రామాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. దాంతో జనం భయం గుప్పిట్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇండ్లు, భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలమట్టం అవుతున్నాయి. కాల్వలు, చెరువులు, రోడ్లు తెగిపోతున్నాయి. ఈ వరద సృష్టిస్తోన్న బీభత్స దృశ్యాలను ‘దిశ’ మీ ముందు ఉంచుతోంది.

Advertisement

Next Story