ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ షార్ట్ ఫిలిం పోటీలకు ఆహ్వానం...

by Sumithra |
ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ షార్ట్ ఫిలిం పోటీలకు ఆహ్వానం...
X

దిశ, ఆర్మూర్ : శాంతి భద్రతల, సమాజ రక్షణలో తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా పెట్టి పోరాడి వీరమరణం పొందిన అమర పోలీసుల జ్ఞాపకార్ధం ఈనెల 21 న " పోలీస్ ఫ్లాగ్ డే" నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పోలీస్ రిలేటెడ్ అంశం మీద ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం తీయడానికి నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని ఆసక్తి గల యువతకు ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు ముందుకు రావాలని ఆర్మూర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ వెంకటేశ్వర్ రెడ్డి శనివారం తెలిపారు.

ఇందులో భాగంగా పోలీసుల త్యాగాలు, పోలీసు విధుల్లో ప్రతిభను తెలిసే విధంగా ఉండే తీసిన (3) ఫోటోలు, తక్కువ నిడివి (3 నిమిషాలు) గల షార్ట్ ఫిలిమ్స్ తీసి రాష్ట్ర స్థాయి పోటీల కోసం ఈ నెల 19 వ తేదీ సాయంత్రంలోగా కమిషనరేట్ కార్యాలయంలోని ఎన్.ఐ.బీ ఇన్స్పెక్టర్ కి లేదా పోలీస్ పి.ఆర్.ఓకి అందజేయాలన్నారు. ఈ షార్ట్ ఫిలిం 3 నిమిషాలు మించకూడదని, 10 x 8 సైజ్ ఫోటోలను షార్ట్ ఫిలింను పెన్ డ్రైవ్ లో మీ పూర్తి వివరాలతో అందజేయాలని, కమిషనరేట్ స్థాయిలో ఎంపిక అయిన మూడు షార్ట్ ఫిలింలను, ఫోటోలను రాష్ట్ర స్థాయి పోటీల గురించి రాష్ట్ర డి.జి.పి ఆఫీస్, హైదరాబాద్ కు పంపిస్తారన్నారు. మరిన్ని వివరాల కోసం 9440001827 నెంబర్ కు సంప్రదించాలన్నారు.

Advertisement

Next Story