అక్రమంగా తరలిస్తున్న అడవి పందుల పట్టివేత

by Nagam Mallesh |
అక్రమంగా తరలిస్తున్న అడవి పందుల పట్టివేత
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ః నందిపేట్ మండలం శాపూర్ శివారులో బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న నాలుగు అడవి పందులను ఆదివారం ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. ఫారెస్ట్ అధికారులకు అందిన విశ్వసనీయ సమాచారంతో పట్టుకున్నట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్, డిప్యూటి రేంజ్ ఆఫీసర్ సుధాకర్ తెలిపారు. శాపూర్ శివారులో వాహనాలను తనిఖీ చేస్తుండగా బొలెరో వాహనంలో వన్యప్రాణుల వేటకు ఉపయోగించే సామాగ్రిని అధికారులు గుర్తించారు. అనుమానం వచ్చిన అధికారులు బొలెరో డైవర్, ఆయనతో పాటు వాహనంలో ఉన్న ముగ్గురు వ్యక్తులను విచారిస్తుండగా అక్కడి నుండి పారిపోయారు. అదే వాహనంలో నాలుగు అడవి పందులను, వన్యప్రాణుల వేటకు ఉపయోగించే వలలు, ఇతర సామాగ్రిని గుర్తించారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో రాత్రి వేళల్లో ఇనుప తీగల్ని అడ్డంగా కట్టి, వలలు పెట్టి వణ్యప్రాణులను వేటాడుతున్నట్లు ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. వన్య ప్రాణుల సంరక్షణ కోసం ఆటవీశాఖ కఠిన చట్టాలు అమలు చేస్తోందన్నారు. ఎవరైనా వన్యప్రాణులను వేటాడినా, వాటిని చంపి వండినా కఠిన చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ హెచ్చరించారు. పరారీలో ఉన్న వేటగాళ్లను పట్టుకుంటామని, వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed