- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అర్ధరాత్రి అధికారుల పేరిట అక్రమంగా ఇసుక దందా
దిశ, బిచ్కుంద: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో అర్ధరాత్రి రెండు బొలెరోల్లో అక్రమంగా ఇసుకను ఖాళీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఫోటో కవరేజ్ కోసమై వచ్చిన విలేకరిపై సదరు బొలెరో డ్రైవర్లు దురుసుగా ప్రవర్తించడంతో వాగ్వివాదం జరిగింది. బొలెరో డ్రైవర్లు మరింతగా రెచ్చిపోతూ.. అసలు ఎవరు నువ్వు ఎందుకు ఫోటోలు తీస్తున్నావు నీకు ఎంత ధైర్యం అంటూ సదురు విలేకరిపై దౌర్జన్య కాండకు దిగారు. అయితే ఈ అక్రమ ఇసుక దందాపై విలేఖరి ప్రశ్నించగా.. ఈ బండ్లు బిచ్కుంద ఆర్ఐ కు సంబంధించినవని చెప్పారు.
దీంతో సదరు విలేఖరి బిచ్కుంద ఆర్ఐ కి వివరణ కోరగా ఆ బండ్లు మాకు సంబంధించినవి ఎంత మాత్రం కావని కర కండిగా చెప్పడం జరిగింది. కాగా.. ఈ బొలెరో వాహనాలు పొరుగున ఉన్న మరొక మండలానికి సంబంధించిన ఆర్ఐ పంపినట్లు పలువురు గుసగుసలాడుకుంటున్నారు. ఈ అక్రమ ఇసుక రవాణా అధికారులకు తెలిసి ఇంత దర్జాగా జరుగుతున్నప్పటికీ పై అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. పట్టుకోవాల్సిన అధికారులు తమ స్వార్థం కోసం అక్రమ ఇసుక దందాకు వెనుక ఉండి నడిపిస్తున్నారు అంటూ పలువురు చర్చించుకుంటున్నారు.