రైలులో ప్రయాణిస్తున్నారా అయితే జాగ్రత్తా..!

by Kalyani |
రైలులో ప్రయాణిస్తున్నారా అయితే జాగ్రత్తా..!
X

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ రైల్వే జంక్షన్ గుండా వివిధ ప్రాంతాలకు తమ తమ పనుల నిమిత్తం ప్రయాణించే ప్రయాణికులకు రైల్వే ఎస్సై సాయి రెడ్డి పలు సూచనలు చేశారు. నిజామాబాద్ జిల్లా కు సరిహద్దున మహారాష్ట్ర ఉండడం వలన ఎక్కువగా దొంగతనాలు, చైన్ స్నాచింగ్ అవుతున్నాయి. అందుకని ప్రయాణికులు ప్రయాణం చేసే వేళ మీ వెంట విలువైన బంగారు ఆభరణాలు, ఎక్కువగా డబ్బులు తీసుకుని వెళ్ళవద్దని, అలాగే మెడలో ఉన్న చైన్ లు కనిపించకుండా కవర్ చేసుకోవలన్నారు. అలాగే ట్రెయిన్ ఆగినపుడు డోర్ వద్ద నిల్చో కూడదుఅని, అలాగే కిటికీల వద్ద కూర్చున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. మీ విలువైన వస్తువులు అనగా బంగారం, డబ్బులు బ్యాగులలో పెట్టవద్దని, మీ ప్రయాణం సుఖంగా సంతోషం గా జరగాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రయాణించాలన్నారు.

Next Story

Most Viewed