బడి బయట పిల్లల గుర్తింపు

by Sridhar Babu |
బడి బయట పిల్లల గుర్తింపు
X

దిశ,నిజాంసాగర్ : జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు డోర్ టు డోర్ బడి బయట పిల్లల సర్వేను నిర్వహించారు. నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో గురువారం ఇటుక బట్టీలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలను నలుగురిని బడి బయట పిల్లలుగా గుర్తించారు. ఇందులో మూడవ తరగతి, నాలుగో తరగతి చదివి మధ్యలో చదువును ఆపేసిన ముగ్గురు విద్యార్థులతో పాటు అసలే పాఠశాలకు వెళ్లని మరో విద్యార్థిని కూడా గుర్తించారు. వీరందరూ కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన వారిగా గుర్తించారు. విద్య ఆవశ్యకతపై తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం వీరిని స్థానిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చేర్పించారు. కార్యక్రమంలో సీఆర్పీ బి.శ్రీధర్ కుమార్, నర్సింలు, ఐఇఆర్పీ సునీల్, హరీష్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed