High Court Judge: ఆ కట్టడం మహా అద్భుతం

by Kalyani |
High Court Judge: ఆ కట్టడం మహా అద్భుతం
X

దిశ, భిక్కనూరు : రాతి కట్టడం మహా అద్భుతంగా ఉందని రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ సుజయ్ పాల్ ప్రశంసించారు. దక్షిణ కాశీ, భిక్కనూరు శ్రీ సిద్ధ రామేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా ఉన్న అతి ప్రాచీన కోనేరు (ధర్మగుండం )ను శనివారం హై కోర్ట్ జడ్జ్ కామారెడ్డి జిల్లా పోర్టు పోలియో జస్టిస్ జె. శ్రీనివాస రావు తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కోనేరు ను లోపలి మెట్ల వరకు దిగి అలనాటి కట్టడాలను చూసి ఆశ్చర్య వ్యక్తం చేశారు. అద్భుతం మహా అద్భుతం మంటూ ప్రశంసించారు. ప్రాచీన శిల్పకళా సంపదకు నిదర్శనంగా ఈ కోనేరు పిలుస్తుందని కొనియాడారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు కొడకండ్ల రామగిరి శర్మ కోనేరు విశిష్టతను, దేవాలయ చరిత్రను వారికి వివరించారు.

అప్పటి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు శ్రీమతి కల్పన రమేష్, పలువురు స్వచ్ఛంద సంస్థల ఆర్థిక సహకారంతో కోనేరును శిల్పుల చేత యథావిధిగా పునర్నిర్మించడం జరిగిందన్నారు. హైదరాబాద్ బన్సీలాల్ పేట లో కూడా ఇటువంటి కోనేరు ను చూశానని హైకోర్టు జస్టిస్ సుజయ్ పాల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. శ్రీ సిద్ధ రామేశ్వర ఆలయానికి నాలుగు దశాబ్దాల చరిత్ర ఉందని వివరించగా, స్వామివారిని దర్శించుకునేందుకు మరోసారి వస్తామని హైకోర్టు జడ్జ్ లు వివరించారు. వారి వెంట భిక్కనూరు తహసీల్దార్ కే.శివ ప్రసాద్, ఇంచార్జ్ ఎంపిడిఓ ప్రవీణ్ కుమార్, ఆలయ కార్యనిర్వాహణాధికారి పద్మ శ్రీధర్, భిక్కనూరు సీఐ సంపత్ కుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్, ఆలయ అర్చకులు కొడకండ్ల సిద్ధ రామ శర్మ, ప్రభు సిద్దేష్ లు ఉన్నారు.

Next Story