Bengal Junior Doctors: పశ్చిమ బెంగాల్ లో ఆందోళన బాట పట్టిన జూనియర్ డాక్టర్లు

by Shamantha N |
Bengal Junior Doctors: పశ్చిమ బెంగాల్ లో ఆందోళన బాట పట్టిన జూనియర్ డాక్టర్లు
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లో జూనియర్ డాక్టర్లు మరోసారి నిరసన చేపట్టారు. విధులను పూర్తిగా పక్కన పెట్టి ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు తమ నిరవధికంగా విధులు పక్కన పెట్టినట్లు వెల్లడించారు. వైద్యులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. భద్రతతో పాటు పలు డిమాండ్లు నెరవేర్చాలని బెంగాల్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. భద్రత సహా తమ డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల దృక్పథం కన్పించట్లేదని జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. నిరసన చేపట్టి 52 రోజులు కావస్తున్నా తమపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. పెండింగ్ లో ఉన్న హామీలపై ఇప్పటికీ దీదీ సర్కారు నుంచి ఆమోదం రాలేదన్నారు. దీంతో, మంగళవారం నుంచి వైద్యులు ఆందోళన బాట పట్టారు.

ట్రైనీ డాక్టర్ హత్యాచారం

ఆగస్టు 9న ఆర్జీకర్ హాస్పిటల్ లో ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం జరిగింది. అప్పట్నుంచి వైద్యులు నిరసన చేపట్టారు. 42 రోజుల నిరసన తర్వాత సెప్టెంబర్ 21న ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాక్షికంగా విధుల్లో చేరారు. డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పష్టమైన చర్యలు రాకపోతే.. ఈ సమ్మె కొనసాగిస్తామని వైద్యులు చెప్పారు.

Next Story

Most Viewed