AP Govt.: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. మరో పథకం పేరు మార్పు

by Shiva |
AP Govt.: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. మరో పథకం పేరు మార్పు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత పరిపాలనాపరమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. గత ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాలను యథావిధిగా కొనసాగిస్తూనే పథకాల పేర్లను సర్కార్ మారుస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా జగన్ (Jagan) ప్రభుత్వం చిరు వ్యాపారుల కోసం తీసుకొచ్చిన ‘జగనన్న తోడు’ (Jagananna Thodu) పథకం పేరును మార్చేసింది. ఈ మేరకు ‘చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు’గా పేరును మారుస్తూ సీఎస్ నీరబ్‌ కుమార్ (CS Neerab Kumar) ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, పథకం పేరు మార్చాలంటూ గ్రామ సచివాలయాల నుంచి పెద్ద ఎత్తున విజ్క్షప్తులు రావడంతో పథకం పేరును మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో భాగంగా చిరు వ్యాపారులు, సంప్రదాయ చేతి వృత్తులు, హస్త కళాకారులు ప్రభుత్వం నుంచి రూ.10 వడ్డీ లేని రుణాన్ని పొందనున్నారు.

Next Story

Most Viewed