Haryana assembly elections: హర్యానా మాజీ డిప్యూటీ సీఎం కారుపై దాడి

by Shamantha N |
Haryana assembly elections: హర్యానా మాజీ డిప్యూటీ సీఎం కారుపై దాడి
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ నేత, హర్యానా మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌటాలాపై దాడి జరిగింది. జింద్ జిల్లా ఉచన కలాన్ లో దుష్యంత్ కాన్వాయ్ పై దాడి కలకలం రేపింది. సోమవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. దుష్యంత్ బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా కొందరు యువకులు వీరంగం సృష్టించారు. ఆ తర్వాతే దుష్యంత్ కాన్వాయ్ పై గుర్తుతెలియని వ్యక్తులు ఇటుకలు, రాళ్లతో దాడి చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ రోడ్ షోలో దుష్యంత్‌తో పాటు ఆజాద్‌ సమాజ్‌ పార్టీ నేత చంద్రశేఖర్ రావణ్ కూడా పాల్గొన్నారు.

ఆజాద్ సమాజ్ పార్టీ చీఫ్ పై దాడి

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ దాడి రాజకీయంగా చర్చనీయాంసంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అంతేకాకుండా, ఈ దాడిలో బీజేపీతో పొత్తుపెట్టుకున్న అజాద్ సమాజ్ పార్టీ చీఫ్, ఎంపీ చంద్రశేఖర్ కారుపైనా దాడి జరిగింది. ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి. ఇకపోతే, దుష్యంత్ చౌతాలా ఉచన కలాన్‌ అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. చంద్రశేఖర్ ఆయనకు మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారు. హర్యానాలో అక్టోబర్ 5న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. 8న ఓట్ల లెక్కింపు జరగనున్నాయి.

Next Story

Most Viewed