- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చేతి వృత్తుల వారికి చేయూత
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : చేతి వృత్తుల వారికి చేయూతనందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మయోజన పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు. నగరంలోని ఓల్డ్ గంజ్ లో భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విశ్వకర్మ జయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మొదట స్వర్ణకారుల పతాకాన్ని ఎగురవేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ...కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలను అక్కున చేర్చుకుందన్నారు. చేతివృత్తుల వారికి ఉచిత శిక్షణనిచ్చి వృత్తిలో నైపుణ్యత పెంచుకునే అవకాశం కల్పించిందని అన్నారు. ఉచిత శిక్షణతో పాటు రూ.500 రోజువారీ ఉపకారవేతనం అందిస్తోందన్నారు. ఎలాంటి బ్యాంకు గ్యారంటీ లేకుండా రుణాలను అందిస్తూ చేతి వృత్తుల వారికి ఉపాధిని కల్పించి ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మజ్దూర్ సంఘ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.