నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు

by Sridhar Babu |
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు
X

దిశ,నిజాంసాగర్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలకళ సంతరించుకుంది. దీంతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 52,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్నట్లు నీటి పారుదల శాఖ అధికారి ఏఈఈ శివ ప్రసాద్ తెలిపారు. పూర్తి స్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు కాగా ప్రస్తుతం 1398.38 అడుగుల నీరు నిల్వ ఉంది.

అదేవిధంగా పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం 9.700 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతంలో నుండి హల్ది వాగు, పోచారం ప్రాజెక్టు నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వరద వచ్చి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి చేరుతుంది. మరో రెండు రోజుల్లో నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి మట్టానికి చేరుకుంటుందని నీటి పారుదల శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story