ఎత్తిపోతలకు నిధులు మంజూరు చేయండి

by Naveena |
ఎత్తిపోతలకు నిధులు మంజూరు చేయండి
X

దిశ ,ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకాలకు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కోరారు. ఆర్మూర్ నియోజకవర్గనికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ల నిధులు మంజూరు చేయాలని కోరుతూ..బుధవారం రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని వినయ్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. దీంతో సానుకూలంగా స్పందించిన మంత్రి ఎత్తిపోతల పథకాలకు నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story