అమ్మతో స్నానానికి వెళ్లి..గోదారమ్మ ఒడిలోకి..

by Naveena |
అమ్మతో స్నానానికి వెళ్లి..గోదారమ్మ ఒడిలోకి..
X

దిశ, ఏర్గట్ల : గోదావరి నదిలో యువకుడు ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందిన ఘటన తడపాకల్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాక్లూరు మండలం మాణిక్ బండర్ గ్రామానికి చెందిన ఉమ్మాయి రామ్ చరణ్ తేజ (16) తన తల్లి ఉమ్మాయి గంగమణితో కలిసి కార్తీక మాసం సందర్భంగా.. తడపాకల్ గ్రామం గోదావరి నది స్నానానికి వచ్చారు. స్నానానికి వెళ్లిన తేజ ఈత రాక నీటిలో మునగడం గమనించిన తల్లి రక్షించమంటూ కేకలు వేయడంతో.. స్థానికులు నీటిలో దూకి రక్షించడానికి ప్రయత్నించగా అప్పటికే మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని బయటకి తీసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed