కాంగి"రేసు"లో మండవ

by Sumithra |   ( Updated:2023-10-16 10:09:36.0  )
కాంగిరేసులో మండవ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో సమీకరణలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో 55 స్థానాల్లో కాంగ్రెస్ కాండిడేట్లను ప్రకటించగా అందులో నిజామాబాద్ జిల్లాలోని బోధన్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలోని ఆరు స్థానాలను ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు.

ఆదివారం మధ్యాహ్నం హైదరాబాదులో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఇంటికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, టీపీసీసీ కోశాధికారి సుదర్శన్ రెడ్డితో పాటు కీలక నాయకులు కలిశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన మండవ వెంకటేశ్వరరావు మర్యాదపూర్వకంగా కాంగ్రెస్ నేతలను ఆహ్వానించి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పై సమాలోచనలు చేసినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన మండల వెంకటేశ్వరరావుకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత, సీనియర్ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ కు సీనియర్ రాజకీయ నాయకుడైన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు మధ్య పోరు హోరాహోరీగా ఉండనుంది.

నిజామాబాద్ రూరల్ అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డి, టీపీసీసీ కార్యదర్శి నగేష్ రెడ్డి, మాజీఎమ్మెల్సీ అరికెల నరసారెడ్డిలు ఆశిస్తున్నారు . అందులో ఇద్దరినీ ఎంపిక చేస్తారని అనుకున్నప్పటికీ గెలుపు గుర్రాలకి అవకాశం ఇచ్చే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు నిజామాబాద్ రూరల్ నుంచి మండల వెంకటేశ్వరరావును ఎన్నికల బరిలో దించేందుకు సన్నద్ధం చేశారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ నేతలు గెలుపు గుర్రాలకి అవకాశం ఇస్తున్నారనేది చెప్పక తప్పడం లేదు.

మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత కొంతకాలంగా బీజేపీలో కొనసాగుతున్న ఏనుగు రవీందర్ రెడ్డి పార్టీ మారతారని జోరుగా ప్రచారం సాగుతోంది. అందులో భాగంగా ఆయన ఆదివారం కాంగ్రెస్ కండువా కప్పుకోవడం విశేషం. ఏనుగు రవీందర్ రెడ్డి ఎల్లారెడ్డి నుంచి నాలుగు సార్లు గెలిచిన 2018లో మాత్రం ఓటమి చెందారు. టీఆర్ఎస్ పార్టీ స్థాపన నుంచి ఆ పార్టీలో ఉన్న ఏనుగు రవీందర్ రెడ్డి ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ తరపున గెలిచిన జాల సురేందర్ గులాబీ కండువా కప్పుకోవడంతో ఆయన ఆ పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఈటెల రాజేందర్ తో పాటు బీజేపీల చేరిన ఏను రవీందర్ రెడ్డి అక్కడ ఎక్కువ కాలం ఉండలేకపోయారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు నాయకులు టికెట్ కోసం నువ్వా నేనా అన్న రీతిలో పోటీపడుతున్నారు. తాజాగా సీనియర్ మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం అనుకూల వాతావరణమైనప్పటికీ ఆయనకు ఎక్కడ టికెట్ ఇస్తారని చర్చ మొదలైంది. ఏనుగు రవీందర్ రెడ్డిని బాన్సువాడ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో ఉంచుతారన్న ప్రచారం జరుగుతుంది.

కాంగ్రెస్ పార్టీ మొదటి జాబితా విడుదల చేసిన తర్వాత పార్టీలో చేరికలు కొత్త ముఖాలు తెరపైకి రావడం అభ్యర్థులు ఎంపికలో మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువయ్యాయి. రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్పినట్టుగానే గెలుపు గుర్రాలకి అవకాశాలు ఉంటాయని ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఢీ కొట్టే సత్తా ఉన్నవారికి టికెట్లు ఇచ్చేలా పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో ముగ్గురు కాండేట్లను ప్రకటించగా తాజాగా కామారెడ్డి నియోజకవర్గం నుంచి షబ్బీర్ అలీ పేరు దాదాపు ఖరారు అయినట్టేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మిగిలిన 5 నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాల లాంటి నాయకులను ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్లను సైతం పక్కన పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. కొందరు నాయకులు తమ పార్టీలో గెలిచే అభ్యర్థులను కాదని సొంత ప్రయోజనాల కొరకు ఇతరులను తెరపైకి తెస్తున్న రేపు మాకు వెలువడే తుది జాబితాలో గెలుపు గుర్రాల పేర్లు ఫైనల్ చేసే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే వచ్చిన సర్వేల రిపోర్టుల ఆధారంగా లీడర్ల చరిష్మాను పర్యలోకి తీసుకొని గతంలో పార్టీకి వారు చేసిన సేవలను అంచనా వేస్తూ టికెట్లను కేటాయించడం దాదాపు ఖాయమైందని నాయకులు చెబుతున్నారు. రేపు మాకు మిగిలిన జాబితాలు ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేస్తారని పార్టీలో చర్చ జరుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed