తృటిలో తప్పిన ప్రమాదం.. అడవి పందులు అలా చేయడంతో

by Disha News Desk |
తృటిలో తప్పిన ప్రమాదం.. అడవి పందులు అలా చేయడంతో
X

దిశ, పిట్లం: అడవి పందుల దెబ్బకు రోడ్డు ప్రమాదం జరిగింది. దంపతులు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పిట్లం మండలంలోని సిద్దాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల నర్సరీ వద్ద మంగళవారం నాడు ఉదయం చోటుచేసుకుంది. అడవి పందులు ఒక్కసారిగా రోడ్డు పైకి రావడంతో ద్విచక్ర వాహనంపై వస్తున్న దంపతులు వాటిని ఢీ కొట్టారు. దాంతో బండి జారిపడిపోయింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలకు గాయాలయ్యాయి.

వివరాల్లోకి వెళితే.. బిచ్కుంద మండలం పుల్కల్ గ్రామానికి చెందిన గంగారాం, గంగ మణి, వీరి కుమారుడు శివ పిట్లం మండల కేంద్రానికి శుభకార్యానికి వెళ్తున్నారు. అదే సమయంలో వారు సిద్ధాపూర్ పరిధిలోకి వచ్చేశరికి అడవి పందులు రోడ్డు పైకి వచ్చాయి. దాంతో వెంటనే వాటిని తప్పించబోయి మరో వాహనాన్ని ఢీకొట్టారు. వారిని గమనించిన కొందరు వాహనదారులు వెంటనే 108 వాహనానికు ఫోన్ చేశారు. అనంతరం వారిని చికిత్స నిమిత్తం పిట్లం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Advertisement

Next Story