హోరాహోరీగా కుస్తీ పోటీలు

by Sridhar Babu |
హోరాహోరీగా కుస్తీ పోటీలు
X

దిశ,కల్హేర్ : కల్హేర్ మండలం బీబీపేట్ గ్రామంలో నల్ల పోచమ్మ, ముత్యాల పోచమ్మ ఆలయాల ఉత్సవాల్లో భాగంగా గురువారం కుస్తీ పోటీలను ఘనంగా నిర్వహించారు. కుస్తీ పోటీలో కల్హేర్, నారాయణఖేడ్, పిట్లం, నిజామాబాద్, మహారాష్ట్ర, కర్ణాటక, ప్రాంతాల నుంచి వచ్చిన మల్లయోధులు తలపడ్డారు. మల్లయోధుల మధ్య కుస్తీ పోటీలు ఉత్కంఠగా సాగాయి.

చివరి కుస్తీలో అంతపూర్ గ్రామానికి చెందిన గంగారం దెగ్లూర్ కు చెందిన పప్పుపై విజయం సాధించి పది తులాల వెండి కడియాన్ని గెలుపొందారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై అంజయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు యెన్నం అనిల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గుండు నరేందర్, బండారి సాయిలు, బీఆర్ఎస్ నాయకులు కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed