నిజామాబాద్ లో నకిలీ ఆన్లైన్ గొలుసు దందా

by Sridhar Babu |
నిజామాబాద్ లో  నకిలీ ఆన్లైన్ గొలుసు దందా
X

దిశ, నిజామాబాద్ సిటీ : నకిలీ ఆన్లైన్ మోసం నిజామాబాద్ జిల్లాలో తాజాగా వెలుగు చూసింది. గ్రాబిజ్ ఫ్యాషన్ కు చెందిన ఈ ఆన్లైన్ నెట్వర్క్ చైన్​ సిస్టం ద్వారా అమాయక యువత నుండి ఉద్యోగం కల్పిస్తామంటూ వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. అందులో చేరడం ఆ తర్వాత తమ కింద ఐదుగురిని కంపెనీలో చేర్చాలని అప్పుడే సంస్థ నుండి వేతనం అందుతుందని కంపెనీ ప్రతినిధులు బురిడీ కొట్టిస్తున్నారు. ఒకొక్కరు నుంచి నలభై ఐదు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. కొంతకాలంగా నిజామాబాద్​లో కార్యాలయం

ఏర్పాటు చేసుకొని అమాయక యువత నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదే క్రమంలో మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ యువతి గత నెల 15న ఈ ఆన్లైన్ సంస్థకు చెందిన మేనేజర్ నికిత అనే మహిళకు 45 వేల రూపాయలు ఫోన్ పే ద్వారా చెల్లించింది. ఆ తర్వాత డబ్బులు కట్టిన యువతి తనకు వేతనం ఇవ్వాల్సిందేనని, లేకపోతే తిరిగి తన డబ్బులు ఇవ్వాల్సిందిగా నిలదీయడంతో వీరి బాగోతం వెలుగులోకి వచ్చింది. రూ. 45వేలు ఇవ్వాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలని మరో ఐదుగురిని కంపెనీలో జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయని,

లేకపోతే రావని బెదిరిస్తున్నారని బాధితురాలు వాపోయారు. ఈ కంపెనీలో నిజామాబాద్​కు చెందిన యువతీ యువకులు ఏ ఒక్కరూ లేకపోవడం గమనార్హం. అయితే సుమారు 70 మందితో కూడిన ఈ నెట్వర్క్ దాదాపు మూడు కోట్ల వరకు దోచుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు బాధితులు నిజామాబాద్ రూరల్ పోలీస్​లకు ఫిర్యాదు చేశారు. పోలీస్ లు నిర్వాహకులను స్టేషన్ కు రప్పించారు. విచారణ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed