Reliance Jio: మరో రెండు కొత్త రీచార్జ్ ప్లాన్ లను ప్రవేశపెట్టిన జియో..ఏంటవి..?

by Maddikunta Saikiran |
Reliance Jio: మరో రెండు కొత్త రీచార్జ్ ప్లాన్ లను ప్రవేశపెట్టిన జియో..ఏంటవి..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ప్రైవేట్ టెలికం సర్వీస్ ప్రొవైడర్ రిలయన్స్ జియో(Reliance Jio) కొత్తగా రెండు రీచార్జ్ ప్లాన్స్(Recharge plans) ప్రవేశపెట్టింది.ఈ కొత్త ఆఫర్‌లలో రూ. 1,028, రూ. 1,029 రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి. ఈ రీఛార్డ్ ప్లాన్స్ ఏయే బెనిఫిట్స్ ఆఫర్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం..

జియో రూ. 1,028 రీఛార్జ్ ప్లాన్ :

రూ. 1,028 ప్లాన్ 84 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంస్ లను అందిస్తుంది. ఆలాగే డైలీ 2జీబీ డేటాను సబ్‌స్క్రైబర్‌లు పొందుతారు. ఈ ప్లాన్ వ్యవధిలో మొత్తం 168జీబీ లభిస్తుంది. జియో 5జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో యూజర్లు ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ 5జీ డేటాను పొందవచ్చు. జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ సేవలకు కూడా యాక్సెస్‌ లభిస్తుంది. ఇక ఈ ప్లాన్‌లో స్విగ్గీ వన్ లైట్ మెంబర్‌షిప్ కూడా ఉంది.

జియో రూ. 1,029 రీఛార్జ్ ప్లాన్ :

రూ. 1,029 ప్లాన్.. అనేక ఆకర్షణీయమైన బెనిఫిట్స్ అందిస్తుంది.ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు 84 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ , డైలీ 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ 5జీ డేటా పొందవచ్చు. ఈ ప్లాన్ అమెజాన్ ప్రైమ్ లైట్ బెనిఫిట్స్ కూడా అందిస్తుంది.రూ. 1,028 ప్లాన్ మాదిరిగానే జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ యాక్సెస్‌ని అందిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed