- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Tata Motors Diwali Offers : కారు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఈ ఆరు కార్లపై దీపావళి బంపర్ ఆఫర్లను ప్రకటించిన టాటా..ఏంటవి..?
దిశ, వెబ్‌డెస్క్:దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసిన పండగల సీజన్(Festival season) నడుస్తోంది. ఈ మేరకు కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఆటోమొబైల్స్ కంపెనీలు(Automobile companies) పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇక మరికొన్ని రోజుల్లో దీపావళి(Diwali) పండగ సీజన్ మొదలు కాబోతుంది. ఈ నేపథ్యంలో కార్లు కొనుగోలు చేయాలనుకునే వారికి టాటా కంపెనీ(Tata Company) శుభవార్త చెప్పింది. దీపావళి సమీపిస్తున్న తరుణంలో టాటా మోటార్స్(Tata Motors) ఆరు కార్లపై బంపర్ ఆఫర్లను అందిస్తోంది. టాటా పంచ్, టాటా టియాగో, టాటా నెక్సాన్, టాటా సఫారీ,టాటా ఆల్ట్రోజ్, టాటా హారియర్ వేరియంట్ లపై రూ. 1.33 లక్షల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. టాటా టియాగో XE, XM, XTD మినహా అన్ని వేరియంట్లపై 30 వేల వరకు ఆఫర్ ను ప్రకటించగా, టాటా ఆల్ట్రోజ్ స్పోర్టీ లుకింగ్ రేసర్ వేరియంట్‌పై రూ. 50,000 తగ్గింపును అందిస్తోంది. ఇక టాటా పంచ్ 2023 పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లు వరుసగా రూ. 18 వేలు, రూ. 15 వేల వరకు తగ్గింపు ఉండగా, టాటా నెక్సాన్ 2024 స్టాండర్డ్ మోడల్‌పై 20 వేల రూపాయల వరకు, ఫియర్‌లెస్ రేంజ్‌పై 35 వేల రూపాయల వరకు తగ్గింపును అందిస్తోంది. మరోవైపు టాటా సఫారీ, టాటా హారియర్ 2023 వేరియంట్ లపై రూ. 1,33,000 తగ్గింపును పొందుతారు.