- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇలా చేస్తే మా పరువు ఏమైపోవాలి.. మాజీ ఎంపీపీ అధ్యక్షులు బైండ్ల సుదర్శన్
దిశ, భిక్కనూరు : ఎవరో కంప్లైంట్ చేస్తే.. మందు బాటిళ్ళ కోసం... మా ఇంట్లోకి వచ్చి సోదా చేస్తారా...? ఎవరిళ్ళన్న విషయం కూడా తెలుసుకోకుండా సోదాలు చేస్తే, మా పరువు ఏమవుతుందంటూ ఎక్సైజ్ సీఐ పోతి రెడ్డి పై కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల మాజీ ఎంపీపీ అధ్యక్షులు బైండ్ల సుదర్శన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం దోమకొండ ఎక్సైజ్ కార్యాలయానికి కాచాపూర్ గ్రామస్తులు వందమంది వెళ్ళారు. ఎక్సైజ్ సీఐ పోతిరెడ్డి తో పాటు, వారి కార్యాలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
ఎక్సైజ్ సీఐ తో పాటు సిబ్బందిని కార్యాలయంలోనికి వెళ్లకుండా అడుగడుగునా అడ్డుకున్నారు. కార్యాలయం ఎదుట బైఠాయించి వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే సర్పంచ్ ఇల్లు అని ఎక్సైజ్ కానిస్టేబుల్ కు తెలియదని, సంఘం పక్కన హోటల్ ఆ పక్కన ఉన్న కిరాణా దుకాణంతో పాటు, పక్కనే ఉన్న ఇంట్లోకి వెళ్లి వచ్చాడని సీఐ పోతిరెడ్డి వాగ్వాదానికి దిగిన గ్రామస్తులను సముదాయించే ప్రయత్నం చేశారు.
గ్రామ మాజీ సర్పంచ్ బైండ్ల భూపతి అడ్డుకొని, మాజీ ఎంపీపీ అధ్యక్షుడు ఇల్లుతో పాటు, ప్రస్తుత గ్రామ సర్పంచ్ తొగరి సులోచన ఇళ్లన్న విషయం తెలియకుండానే సోదా చేసేందుకు వెళ్ళాడా అంటూ మండిపడ్డారు. పొరపాటున వెళ్ళాడు తప్పా, కావాలని మాత్రం ఆ ఇంటికి వెళ్లలేదని ఎక్సైజ్ సీఐ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ గ్రామస్తులు మాత్రం శాంతించలేకపోయారు.
దీంతో మాజీ ఎంపీపీ బైండ్ల సుదర్శన్ అడ్డుకొని, పొరపాటున మీరు సోదా చేసిన సమయంలో తన ఇంట్లో మందు బాటిల్ దొరికితే పరిస్థితి ఏమయ్యేదని, తనకు మందు తాగె అలవాటు కూడా లేదని, ఈ విషయం జిల్లాలో ఉన్న పోలీసు సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరికి తెలుసన్నారు.
గ్రామంలో బెల్ట్ బంద్ కు తీర్మానం చేసినప్పటి నుంచి, పక్కనే ఉన్న మాందాపూర్, దోమకొండ, ఇతర ప్రాంతాల నుంచి తన స్నేహితుల కోసం కొనుక్కొచ్చి తాగిస్తున్నారన్నారు. జరిగిందేదో జరిగిపోయిందని ఇక నుంచి అలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తానని ఎక్సైజ్ సీఐ పోతిరెడ్డి గ్రామస్తుల క్షమాపణ చెప్పడంతో రెండు గంటలపాటు చేసిన ఆందోళనను విరమించారు.