డబుల్ బెడ్ రూమ్ బిల్లులు చెల్లించాలి

by Sridhar Babu |
డబుల్ బెడ్ రూమ్ బిల్లులు చెల్లించాలి
X

దిశ, కోటగిరి : తమకు రావాల్సిన డబుల్ బెడ్ రూంలకు సంబంధించిన బిల్లులు వచ్చినా ఇవ్వడంలేదని లబ్ధిదారులు స్థానిక రోడ్డు పై బైఠాయించి నిరసన తెలిపారు. తక్షణమే హౌసింగ్ డీఈ నాగేశ్వరరావు వచ్చి బిల్లులను తమకు ఎందుకు ఇవ్వడం లేదనే విషయంపై సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించారు. ఈ కార్యక్రమంలో హన్మాండ్లు, శ్రీను, దౌలయ్య, పాషా, సంజు, సురేష్, సందీప్, మక్కయ్య పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed