ఘనంగా దసరా వేడుకలు.. పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు

by Mahesh |
ఘనంగా దసరా వేడుకలు.. పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : జిల్లా వ్యాప్తంగా విజయ దశమి వేడుకలు అంబరాన్నంటాయి. గ్రామాల్లో పట్టణాల్లో ప్రజలు ఆనందోత్సవాల నడుమ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. తొమ్మి రోజుల పాటు వివిధ అలంకారాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదశమి రోజు శమీ పూజ ఆయుధ పూజ, వాహనాలకు పూజలు నిర్వహించారు. ఒకరికొకరు జమ్మి ఆకు ఇచ్చిపుచ్చుకుని ఆత్మీయ ఆలింగానాలు చేసుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పలు ప్రాంతాల్లో రావణాసురుని దహన కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించారు. విజయదశమి దసరా పర్వదినం సందర్భంగా సిద్దిపేటలోని శ్రీ ఉమా పార్వతీ సమేత కోటి లింగేశ్వర స్వామి దేవాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు శమీ పూజలో పాల్గొన్నారు. కోటి లింగేశ్వర స్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా వేడుకల్లో భాగంగా నర్సాపూర్, రంగదాంపల్లి, రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తా ల వద్ద నిర్వహించిన రావణాసురుని దహన కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు.

చెడుపై మంచి విజయం సాధించిన పర్వదినం: ఎమ్మెల్యే హరీష్ రావు

విజయ దశమి అంటే చెడు ఫై మంచి విజయం సాధించిన పర్వదినం అని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. అమ్మవారి దయతో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అభివృద్ధి లో రాష్ట్రం లోనే సిద్దిపేట నియోజకవర్గం నంబర్ వన్ గా నిలిచింది అన్నారు. సిద్దిపేట స్టీల్ బ్యాంకు గురించి 15వ ఆర్థిక సంఘం ప్రత్యేకంగా ప్రస్తావించింది అన్నారు. సిద్దిపేట ప్రజల దశాబ్దాల కలలు అయిన సిద్దిపేట జిల్లా ఏర్పాటు, రైలు, మెడికల్ కాలేజీ, గోదావరి జలాలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెరవేరుచున్నట్లు వెల్లడించారు. రంగనాయక సాగర్ మూడు టీఎంసీల నీటితో కలకల లాడుతుందన్నారు. రంగనాయక సాగర్ కింద రైతులు లక్ష ఎకరాల్లో రెండు పంటలు పండిస్తున్నట్లు తెలిపారు. త్వరలో సిద్దిపేట నుంచి తిరుపతికి బెంగుళూరు కు రైలు వెళుతుందని వెల్లడించారు. విజయ దశమి అమ్మవారి ఆశీస్సులతో సిద్దిపేట అభివృద్ధి లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Advertisement

Next Story