- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పట్నం నియామకం రాజ్యాంగ విరుద్ధం : హరీష్ రావు
దిశ, వెబ్ డెస్క్ : శాసనమండలి చీఫ్ విప్‌గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి నియామకం రాజ్యాంగ విరుద్ధమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అభ్యంతరం లేవనెత్తారు.
పట్నం మహేందర్ రెడ్డి ఏ పార్టీకి చెందిన వ్యక్తి? ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు. మీడియా చిట్ చాట్ లో హరీశ్ రావు మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహేందర్ రెడ్డికి చీఫ్ విప్ పదవి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఆయనపై చైర్మన్ వద్ద ఇప్పటికే అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. చైర్మన్ మండలి చీఫ్ విప్‌గా మహేందర్ రెడ్డిని నియమిస్తు జారీ చేసిన బులెటిన్ అనర్హత పిటిషన్‌కు మరింత బలం చేకూర్చిందన్నారు. దీన్ని కూడా అనర్హత పిటిషన్‌లో సాక్ష్యంగా చేరుస్తామని హరీశ్ రావు తెలిపారు. ఎమ్మెల్సీ హోదాలోనే పంద్రాగస్టు, సెప్టెంబర్ 17న మహేందర్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారని, మార్చి 15 నుంచే ప్రభుత్వ చీఫ్ విప్ అని బులెటిన్ ఇచ్చారని, దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తామన్నారు. రాష్ట్ర గవర్నర్ తో పాటు డీవోపీటీకి కూడా లేఖ రాస్తామని, వారికి కూడా ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని చెప్పేందుకు ఇదొక ఉదాహరణ అని పేర్కొన్నారు. పీఏసీ చైర్మన్ విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాగే వ్యవహరించిందని హరీశ్‌రావు విమర్శించారు. బిల్ పాస్ చేయించడం, ప్రభుత్వ బిజినెస్ జరిగేలా చీఫ్ విప్ బాధ్యత అని, మహేందర్ రెడ్డి ఇప్పుడు ఎవరికి విప్ ఇష్యూ చేస్తాడని, అధికార పార్టీ సభ్యులకా... ప్రతి పక్ష పార్టీ సభ్యులకా అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఆయన విప్ జారీ చేస్తడా.. లేక బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన విప్‌ను పాటిస్తాడా అని ఎద్దేవా చేశారు. పీఏసీ చైర్మన్ వివాదంలోనూ శాసనసభ సమావేశాలు ముగిసే నాటికి బీఆర్ఎస్ పార్టీ సభ్యుల సంఖ్య 38 అని స్పీకర్ గారే చెప్పారని, ఈ విషయాన్ని కాంగ్రెస్ వారు కూడా చెప్పారని, అప్పుడు అలా చెప్పి మళ్లీ మా పార్టీ వాళ్లు కాదు అని మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ పార్టీ 38 మంది అని వాళ్లే చెప్తారు, మళ్ళీ మా వాళ్లు కాదని చెప్తారని హరీశ్ రావు మండిపడ్డారు.