Samantha: సామ్ కొత్త యాడ్ ను చూశారా.. పింక్ డ్రెస్ లో మెరిసిపోతున్న సమంత

by Prasanna |   ( Updated:2024-10-13 07:50:53.0  )
Samantha: సామ్ కొత్త యాడ్ ను చూశారా.. పింక్ డ్రెస్ లో మెరిసిపోతున్న సమంత
X

దిశ, వెబ్ డెస్క్ : మన తెలుగు సెలబ్రిటీలు దీపం ఉన్నప్పుడే అన్ని చక్కబెట్టుకోవాలనుకుంటారు. సినిమాలు మాత్రమే కాకుండా యాడ్స్ కూడా చేసి రెండు చేతులా డబ్బును సంపాదిస్తున్నారు. ఇప్పుడు సామ్ కూడా అదే రూట్ లో వెళ్తుంది. వ్యక్తిగత జీవితంలో ఈ ముద్దుగుమ్మ ఎంత నలిగిపోయిందో మనందరికీ తెలిసిందే. నాగ చైతన్యతో విడాకులు, అనారోగ్య సమస్యలు, మొన్నటికి మొన్న ఓ మంత్రి సామ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఇలా ఏదోక కష్టం సమంతకి ఎదురవుతూనే ఉంది. కానీ, వాటన్నింటిని ధైర్యంతో ఎదుర్కొని ముందుకు అడుగులు వేసింది. తాజాగా మరో కొత్త యాడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

గతంలో సమంత అనేక యాడ్స్ చేసింది. తాజాగా, ఇప్పుడు సబ్బుకి సంబంధించిన యాడ్ చేసి వార్తల్లో నిలిచింది. ఇప్పటికి ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ ఆ సబ్బు యాడ్స్ చేసారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో సమంత కూడా చేరింది. ఈ యాడ్ కోసం సామ్ రెమ్యునరేషన్ గట్టిగానే తీసుకున్నట్టు సమాచారం. ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా .. క్షణాల్లో వైరల్ అయింది. ఈ యాడ్ ను చూసిన నెటిజెన్స్ పింక్ డ్రెస్ లో సమంత మెరిసిపోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story