- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Saibaba : రేపు ప్రొఫెసర్ సాయిబాబా అంతిమయాత్ర.. ఎక్కడి నుంచంటే..?
దిశ, డైనమిక్ బ్యూరో: పౌర హక్కుల నేత, ఉద్యమకారుడు, రచయిత, విద్యావేత్త, ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా (56) కన్నుమూశారు. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. గుండెపోటుతో మరణించారు. పది రోజుల క్రితం జీర్ణకోశ సంబంధిత సమస్యతో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించి రాత్రి 8.45 గంటలకు చివరి శ్వాస విచిడిచినట్లు వైద్యులు తెలిపారు. అయితే, రేపు (సోమవారం) ఉదయం 10:00 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కానుంది. హైదరాబాద్ మౌలాలీలోని జవహర్ నగర్ నుంచి సాయిబాబా సాగనున్న అంతిమయాత్ర కొనసాగనుంది.
నిమ్స్ మార్చురీలో నుంచి ఆయన పార్థివదేహాన్ని అక్టోబర్ 14 (సోమవారం) ఉదయం 8:00 గంటలకు కుటుంబ సభ్యులు తీసుకుంటారు. అక్కడి నుంచి 9:00 గంటల సమయంలో గన్‌పార్క్‌కు చేరి, అక్కడ పావుగంట పాటు పార్ధివదేహన్ని ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మౌలాలి కమాన్ దగ్గర శ్రీనివాసా హైట్స్ చేరి, మధ్యాహ్నం 2:00 గంటలకు అక్కడ ఉంచుతారు. మధ్యాహ్నం 2:30 గంటలకు చివరి ఊరేగింపుగా బయలుదేరి 4:00 గంటలకు గాంధీ మెడికల్ కాలేజీ, సికింద్రాబాద్‌కు చేరుతుంది. అంతిమయాత్ర అనంతరం సాయిబాబా కోరిక మేరకు ఆయన మృతదేహం గాంధీ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఆయన కళ్లను ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు డొనేట్ చేశారు. సాయిబాబాకు చివరి శ్రద్ధాంజలి ఘటించదలచుకున్న వారు ఈ స్థలాల్లో ఎక్కడికైనా రావొచ్చని కుటుంబ సభ్యులు, ఉద్యమ సహచరులు ప్రకటించారు.