Chiranjeevi : ఏపీ ముఖ్యమంత్రి పోస్ట్‌పై స్పందించిన చిరంజీవి కొణిదెల

by Anjali |   ( Updated:2024-10-13 07:52:26.0  )
Chiranjeevi : ఏపీ ముఖ్యమంత్రి పోస్ట్‌పై స్పందించిన చిరంజీవి కొణిదెల
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి చెక్కు అందించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు విరాళంగా కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. కాగా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికన మెగాస్టార్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.‘ చిరంజీవికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సేవకార్యక్రమాల్లో చిరు ఎల్లప్పుడూ ముందుంటారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 1 కోటి అందించారు. ప్రభావవంతమైన కారణాలకు నిరంతరం తన సహాయాన్ని అందిస్తూ ఉంటారు.

వరదల వల్ల నష్టపోయిన వారి జీవితాలను పునర్నిర్మించడంలో మెగాస్టార్ సహకారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది’. అంటూ ఏపీ ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి తాజాగా స్పందించి..‘‘ధన్యవాదాలు చంద్రబాబు. మీ మంచి మాటలకు. మా స్వంత ప్రజలకు సంభవించిన భారీ విపత్తు.. అలాగే మీరు నాయకత్వం వహించిన ఆదర్శప్రాయమైన సహాయక చర్యలను ఎదుర్కొనేందుకు మా వంతు సహాయం చేయడం మా కర్తవ్యం’’. అని చిరు ట్వీట్ చేశారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పలువురు హీరోలు వరద బాధితులకు తమవంతు విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story