ఆ పాఠశాలలోని విద్యార్థుల గోడు పట్టించుకోరా.. స్టోర్ రూమ్‌లో విద్యాభ్యాసం

by Aamani |
ఆ పాఠశాలలోని విద్యార్థుల గోడు పట్టించుకోరా.. స్టోర్ రూమ్‌లో విద్యాభ్యాసం
X

దిశ, ఎల్లారెడ్డి: రేపటి పౌరులను తీర్చిదిద్దే,ఆ పాఠశాల సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. ప్రభుత్వం విద్యకు కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నప్పటికీ అభివృద్ధి మాత్రం ఆ పాఠశాలలో అక్కడే ఆగిపోయింది. ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ పాఠశాలకు ప్రయోజనం సున్నా. ప్రభుత్వం విద్య వైద్యానికి ప్రాధాన్య మిస్తున్నట్లు చెబుతున్న ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట్ మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐదు ఉన్నప్పటికీ అందులో ఒకటి తాండూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఆ పాఠశాలకు కనీస వసతులు లేవని పాత భవనం ఉన్నప్పటికీ విద్యార్థులకు అవస్థలు ఎదురవుతున్నాయని గత ప్రభుత్వం నూతన భవనం నిర్మాణం కొరకు మంజూరు చేసినప్పటికీ అర్ధాంతరంగానే ఆ పాఠశాల భవనం ఆగిపోవడంలో ఆ విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు.


తాండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు తీరని అవస్థలు ఎదుర్కొంటున్నారు. తాండూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒకప్పుడు పేరుగాంచిన పాఠశాలగా పేరుపొందింది. ఆ పాఠశాలలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు ఉన్నతమైన స్థానంలో పలు హోదాలో ఉద్యోగాలు పొంది వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఎంతోమందికి నీడను ఇచ్చిన ,ఆ పాఠశాల నూతన భవనం నిర్మాణం కొరకు ఉన్న పాఠశాలను కూల్చివేయడంతో పాఠశాల భవనానికి మంజూరైన నిధులు సమయానికి రాకపోవడంతో నేడు విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఇరుకు ఇరుకు గదుల్లో, స్టోర్ రూం లో, చెట్ల, కింద ,విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాల నూతన భవనం కొరకు ప్రభుత్వం గతంలో మన ఊరు మనబడి కార్యక్రమం కింద నిధులు మంజూరు చేసి నూతన భవనం నిర్మాణం కొరకు పనులు చేపట్టినప్పటికీ గుత్తేదారులకు సరైన సమయానికి నిధులు మంజూరు కాకపోవడంతో విద్యార్థులకు శాపంగా మారింది. ప్రభుత్వం మారినప్పటికీ పాఠశాల భవనం అర్ధాంతరంగా నిర్మాణంలోనే ఉందని కనీసం విద్యార్థుల భవిష్యత్తు కొరకై అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి భవన నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు అధికారులను వేడుకుంటున్నారు. నూతన భవన నిర్మాణం అసంపూర్తిగా పనులు విద్యార్థుల అవస్థలు గత ప్రభుత్వ పాఠశాలలో అత్యున్నత, వసతులతో కల్పిస్తామని, మన ఊరు మనబడి కార్యక్రమం తీసుకొచ్చి నిధుల లేమితో గుర్తించిన పనుల్లో 40 శాతానికి మించి పనులు పూర్తి కాక పోవడం విద్యార్థులకు తీరని లోటుగా ఏర్పడుతుంది.



రాష్ట్ర ప్రభుత్వం ఏళ్లుగా సర్కార్ బడులు నిరాధారణకు గురే అని కోరుకుంటూ కనీస వసతులు కల్పించేందుకు సిద్ధమైనప్పటికీ వాటిని గుత్తేదారులతో కాకుండా పాఠశాలలో ఏర్పాటు చేసిన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలతో నిర్మాణ పనులు చేపట్టి విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వం తెలిసినప్పటికీ అధికారులు నాయకులు అటువైపు చూడకపోవడం ఆ విద్యార్థులకు, ఆవేదన తప్ప మిగిలింది ఏమీ లేదని విద్యార్థులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జూన్ 10 లోపు పనులు పూర్తి వంతంగా చేయాలని అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం,కు శ్రీకారం చుట్టినప్పటికీ ఇప్పటివరకు పనులు మొదలవ్వకపోవడంతో ఆ పాఠశాల నిర్మాణం అయ్యేనా అర్ధాంతరంగా ఆగేనా అనే దానిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.





విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లేక అవస్థలు

పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లేకపోవడంతో విద్యార్థుల అవస్థలు. మధ్యాహ్న భోజనం ఏజెన్సీలు లేక విద్యార్థులు తమ ఇళ్ల నుండి మధ్యాహ్నం భోజనం తెచ్చుకొని పాఠశాల ప్రాంగణంలోనే భోజనం ఆరగిస్తున్నారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు అప్పుడప్పుడు ఆటలాడుకోవడానికి ప్రాంగణం ఉన్నప్పటికీ అందులో భావన నిర్మాణం కొరకు, గుత్తేదారు, ఇసుక తదితర వంటి సామాగ్రిని వేయడంతో విద్యార్థులకు అవస్థలు ఎదురవుతున్నాయని ఆ పాఠశాల ఉపాధ్యాయులు ,ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పలువురు పేర్కొంటున్నారు. ప్రాంగణంలో ఉన్న ఇసుక వంటి సామాగ్రిని తొలగిస్తే విద్యార్థులకు మేలు చేకూరినట్లు అవుతుందని, అంటున్నారు.

పాఠశాల భవనం త్వరగా నిర్మాణం చేపట్టాలి : పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వెంకటరామిరెడ్డి

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తాండూర్ గ్రామంలో నూతన భవనం నిర్మాణంలో ఉందని అర్ధాంతరంగా నిధులు లేక భవన నిర్మాణం ఆగిపోయిందని, ప్రధానోపాధ్యాయులు వెంకటరామిరెడ్డి అన్నారు. పాఠశాలలో 111 మంది విద్యార్థులు ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్నారని 8 తరగతి గదులతో భవన నిర్మాణం అవుతుంది త్వరగా భవన నిర్మాణం అయితే విద్యార్థులకు ప్రభుత్వ మేలు చేసింది అవుతుందని ఆయన పేర్కొన్నారు.

పాఠశాల భవనంతో పాటు భవనం చుట్టూ ప్రహరీ కూడా, పాఠశాల ప్రాంగణంలో ఉన్న తెలంగాణ క్రీడా మైదానం తో విద్యార్థులకు సమస్యలు ఏర్పడుతున్నాయని పాఠశాల ప్రాంగణంలో ఉన్న తెలంగాణ క్రీడా ప్రాంగణంలో వేరే చోటుకు మారిస్తే, బాగుంటుందని, దాని ద్వారా పాఠశాలలోని విద్యార్థులే కాకుండా బయట నుండి వచ్చే, వారు, సంచరించి పాఠశాలలోని విద్యార్థులకు ఉపయోగపడే నీటి కుళాయిలను ప్రాంగణమంతా చెత్తాచెదారంతో పశువుల పేడతో, పాఠశాల ప్రాంగణంలో రాత్రిపూట గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సీసాలతో ప్లాస్టిక్ కవర్ తో ప్రాంగణమంతా పాడు చేస్తున్నారని, పాఠశాలకు ప్రత్యేకంగా ప్రహరి కూడా పూర్తిగా నిర్మాణం గా ఉంటే బాగుంటుందని అన్నారు. పాఠశాలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని ఆయన అన్నారు.

Advertisement

Next Story

Most Viewed