- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నామకరణం చేసిన.. సీఎం ఎవరో తెలుసా..?
దిశ,బాల్కొండ: ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేస్తున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నామకరణం చేసి నేటికీ 46 ఏళ్లు పూర్తి అయ్యాయి. ప్రాజెక్టు నిర్మాణానికి ముందు నుంచి ఈ ప్రాంతాన్ని పోచంపాడుగా పిలిచేవారు. 1963 జూలై 26న అప్పటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ భారీ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు నిర్మాణ చివరి దశలో 1978 వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం మర్రి చెన్నారెడ్డి ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు. 18 లక్షల ఎకరాల సాగునీటిని, త్రాగు నీటిని అందించే ఈ ప్రాజెక్టు గొప్పతనం తెలిసి.. ఈ ప్రాజెక్టు ను అప్పుడే పోచంపాడుగా పిలవడం బాగాలేదన్నారు. ఈ గ్రామంలో గోదావరి నది తీరాన రాముడు నడయాడినట్లు చారిత్రక గాథల్లో ఉండడం,పవిత్ర గోదావరి నది తీరాన శ్రీ కోదండ రామలింగేశ్వర ఆలయం నిర్మించినందుకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. ఆనాటి నుంచి ఆ పోచంపాడు ప్రాజెక్టును శ్రీరాంసాగర్ ప్రాజెక్టుగా పిలవబడుతుంది.
రైతుల పంట పొలాలకు రెండు కాలాలు నిండుగా సాగునీటిని అందిస్తుంది. దీంతో బాల్కొండ మండలంలో ప్రవహించే కాలువలకు హై లెవెల్ కాలువలుగా పిలుస్తుండేవారు. ఈ జిల్లాలో పంటలు రైతుల ఇంట సిరుల పంటను కురిపిస్తుండడంతో.. హై లెవెల్ కాలువకు లక్ష్మీ కాలువగా నామకరణం చేశారు. నిజామాబాద్ జిల్లా నుంచి కరీంనగర్,వరంగల్ జిల్లాల మీదుగా ప్రవహించే కాల్వను దక్షిణ కాలువగా పిలిచేవారు. కాకతీయులు పరిపాలించిన ఓరుగల్లు (వరంగల్ )జిల్లా మీదుగా ప్రవహించడంతో.. ఈ కాలువను కాకతీయ కాలువగా పిలిచారు. అదిలాబాద్ జిల్లాలో పంటలకు సాగునీరు అందించే కాలువను ఉత్తర కాలువగా పిలిచేవారు. ఈ జిల్లాలో ప్రసిద్ధ బాసర జ్ఞాన సరస్వతి పుణ్యక్షేత్రం ఉండడంతో.. సరస్వతి కాలువగా నామకరణం చేశారు. అదేవిధంగా శ్రీరామ్ సార్ ప్రాజెక్టుకు ప్రాంతాల నుంచి భారీగా వరదలు వచ్చి చేరుతుండడంతో. మిగులు జలాలను గోదావరిలోకి విడుదల చేసి, వృధాగా పోవడంతో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు , ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ముప్కాల్ జీరో పాయింట్ వద్ద 1963 జూన్ 6వ తేదీన ఇందిరమ్మ వరద కాలువకు శంకుస్థాపన చేశారు. కాలువ పనులు పూర్తయిన నాటి నుండి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదలను వరద కాలువ ద్వారా పంట పొలాలకు అదేవిధంగా కరీంనగర్ జిల్లాలోని మిడ్ మానేరు ప్రాజెక్టుకు విడుదల చేయడం జరుగుతుంది.
ఎస్సారెస్పీ లోకి 278 టీఎంసీల వరద
ఈ సీజన్లో జూన్ 1 తేదీ నుంచి వరదలు క్రమక్రమంగా ప్రారంభమై నేటి వరకు 278 టీఎంసీల వరద వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు నిండుకుండలా మారి మిగులు జలాలను గోదావరిలోకి కాలువల ద్వారా విడుదల చేశారు. ప్రస్తుతం కాకతీయ 4000 క్యూసెక్కులు, సరస్వతి 500, లక్ష్మి 150, ఆవిరి రూపంలో 571,మిషన్ భగీరథ మంచినీటి పథకానికి 270 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. యువ ప్రాంతాల నుంచి 5000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చేరుతుందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు 80.5 టీఎంసీ లు కాగా.. సోమవారం నాటికి పూర్తిస్థాయి నీటిమట్టం కలిగి ఉందని అధికారులు వివరించారు.