- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైద్య సేవల్లో నిర్లక్ష్యం చేయొద్దు
దిశ,మద్నూర్ : రోగులకు వైద్య సేవల్లో నిర్లక్ష్యం చేయొద్దని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. శనివారం మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు తదితర వివరాలు వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ఆసుపత్రిలోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, కావాల్సిన మందులు ప్రజలకు అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అందులో భాగంగానే బడ్జెట్ లో వైద్య ఆరోగ్యానికి అధిక నిధులు కేటాయించిందని తెలిపారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ రూపొందించి డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేస్తామని అన్నారు. డాక్టర్లు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది తో పాటు పార్టీ మండల అధ్యక్షులు సాయిలు, బస్వరాజ్ పటేల్ నాయకులు హన్మండ్లు, స్వామి, సాయి పటేల్, రమేష్, అమూల్ తదితరులు పాల్గొన్నారు.