10న అంబేద్కర్ సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశం

by Sridhar Babu |
10న అంబేద్కర్ సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశం
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల10న అంబేద్కర్ సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు ఆకుల బాబు తెలిపారు. అంబేడ్కర్ సంఘం జిల్లాలో కొన్ని సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వెనకబడిన తరగతుల వారికోసం మహనీయుల ఆలోచనా వేదికగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అందుబాటులో నిలిచిందన్నారు. కులం, మతం, అంటరానితనం పేరుతో జరిగిన దాడుల్లో ప్రజలకు, బాధితులకు అంబేద్కర్ సంఘం వారికి మద్దతు గా నిలబడి నిరంతరం పోరాటం చేసిందని గుర్తు చేశారు.

సమసమాజ నిర్మాణమే ధ్యేయంగా నూతన విప్లవాన్ని సృష్టించాలనే సంకల్పంతో సంఘం ఆవిర్భవించిందని పేర్కొన్నారు. సంఘం అనేది ఒక కులానికి, ఒక మతానికో కాకుండా ప్రజల వైపు నిలబడిందన్నారు. కామారెడ్డి జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఏకీకరణ కోసం కృషి చేస్తామని, మహనీయుల ఆలోచన విధానాన్ని ప్రతి గ్రామంలో పరిచయం చేయడం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో ముందుండి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యఅతిథిగా విచ్చేయడం జరుగుతుందన్నారు. సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మల్లన్న, సంగి రాజలింగం, రాజ వర్ధన్, నారాయణ, శివరాములు, రాములు, గైని రాజు, జీవియం విట్టల్, అరవింద్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed