కంప్యూటర్ తరగతులు తప్పనిసరిగా నిర్వహించాలి..

by Sumithra |   ( Updated:2023-02-08 13:40:09.0  )
కంప్యూటర్ తరగతులు తప్పనిసరిగా నిర్వహించాలి..
X

దిశ, గాంధారి : కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఏకలవ్య గురుకుల పాఠశాలను బుధవారం స్థానిక సంస్థల కలెక్టర్ గోత్రీ తనిఖీ చేశారు. పాఠశాలకు సంబంధించిన అన్నివివరాలు అడిగి తెలుసుకున్నారు. కంప్యూటర్ గదిలో కంప్యూటర్ నేర్పించే ఉపాధ్యాయుడు లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతే కాకుండా మధ్యాహ్న భోజనం బాగుందా లేదా అనివిద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

పాఠశాలకు మంజూరు చేయబడిన నిధులు ఇంకో బిల్డింగ్ నిర్మాణాన్ని త్వరత్వరగా పూర్తిచేయాలని అంతేకాకుండా పాత పాఠశాలలో బెత్లూర్పున గ్రామంలో వాటిని కూడా బాగు చేయించాలని ప్రధానోపాధ్యాయులు అమర్ సింగ్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed