డైనమిక్ ఎడిషన్లు ఇవ్వడంలో దిశకు సాటి లేరు

by Sridhar Babu |
డైనమిక్ ఎడిషన్లు ఇవ్వడంలో దిశకు సాటి లేరు
X

దిశ, గాంధారి : డైనమిక్ ఎడిషన్లు ఇవ్వడం లో దిశకు ఎవరూ పోటీ రారు అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ అన్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండ లంలో ఆదివారం దిశ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో దిశ నూతన ఒరవడితో ఎప్పటి వార్తలు అప్పుడే అందిస్తుందని తెలిపారు. అంతేకాకుండా దిశ పత్రిక డైనమిక్ ఎడిషన్లతో ప్రజలకు చేరువైందని, నిజాలను నిష్పక్షపాతంగా రాసే పత్రిక అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గాంధారి, సదాశివనగర్, తాడ్వాయి, లింగంపేట్ కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed