- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మారుతున్న కాలానికి దిశ ఓ ట్రెండ్ సెట్టర్..
దిశ, ఆర్మూర్ : మారుతున్న ప్రస్తుత మానవ నవసమాజానికి డిజిటల్ యుగంలో దిశ ఓ ట్రెండ్ సెట్టర్ అని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎప్పటికప్పుడు వార్తలు రాయడంలో దిశ దినపత్రికకు ఎవరూ సాటి లేరని వార్తలు కచ్చితంగా పాఠకులకు అందించడంలో దిశ యాజమాన్యం అభినందనీయులు అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ ఏరియాలో గల పీవీఆర్ భవన్ లో 2025 నూతన సంవత్సర దిశ క్యాలెండర్ ను ఆదివారం ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. నిజాలను నిర్భయంగా జనాల్లోకి తీసుకెళ్తుందని ప్రభుత్వానికి ప్రజలకు దిశ వారధిగా నిలుస్తుందని వినయ్ రెడ్డి కొనియాడారు.
ప్రజలు పడుతున్న ఇబ్బందులను, సమస్యలను వెలుగులోకి తెస్తున్న దిశపత్రిక యాజమాన్య ప్రతినిధులకు వినయ్ రెడ్డి అభినందనలు తెలిపారు. పత్రికా రంగంలో దిశపత్రికకు ఎవ్వరు సాటి రారని, ఎప్పటికప్పుడు డైనమిక్ ఎడిషన్ ల ద్వారా తాజా సమాచారాన్ని పాఠకులకు అందించడం దిశలో ఉన్న ప్రత్యేకత అన్నారు. ఈ కార్యక్రమంలో దిశ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఇట్టేడి మోహన్ రెడ్డి, ఆలూర్ మండల రిపోర్టర్ ఆ మందు సంజీవ్, సుర్బిర్యాల్ మాజీ సర్పంచ్ సట్లపల్లి సవిత గణేష్, సుర్బిర్యాల్ నవీన్ రెడ్డి, ఆలూర్ కాంగ్రెస్ మండలం ప్రెసిడెంట్ ముక్కెర విజయ్, కాంగ్రెస్ నాయకులు ఎన్.వి.రవీందర్ రెడ్డి (చిట్టి), భూపేందర్, రాజు భాయ్, శ్రీనివాస్, ప్రభాకర్, గుత్ప మాజీ సర్పంచ్ చిన్నయ్య, శశి, మగ్గిడి గంగారెడ్డి, బీరయ్య, తదితరులు పాల్గొన్నారు.