దిశ ఎఫెక్ట్​...ఆలూరు తహసీల్దార్ నరేష్ కు షోకాజ్ నోటీస్ జారీ

by Disha Web Desk 15 |
దిశ ఎఫెక్ట్​...ఆలూరు తహసీల్దార్ నరేష్ కు షోకాజ్ నోటీస్ జారీ
X

దిశ, ఆర్మూర్ : పైసలిస్తేనే పనులు అనే దిశ కథనానికి ఆర్మూర్ ఆర్డీఓ రాజా గౌడ్ మంగళవారం స్పందించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండల కేంద్రంలో గల తహసీల్దార్ కార్యాలయంలో పైసలిస్తే తప్ప పనులు జరగడం లేదన్న దిశ కథనానికి ఆయన స్పందించి ఆలూర్ తహసీల్దార్ నరేష్ కు షోకజ్ నోటీస్ జారీ చేశారు.

ఆర్మూర్ ఆర్డీవో కార్యాలయంలో రాజా గౌడ్ మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆలూరు తహసీల్దార్ కు షోకాజ్ నోటీస్ పంపామని చెప్పారు. ఆయన ఇచ్చే వివరణ బట్టి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి తర్వాత జిల్లా కలెక్టర్ కు నివేదిక అందజేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా ఆలూరు మండలంలోని దేగం గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ రెడ్డిలు స్లాట్ బుకింగ్ చేసుకుని భూమి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు రాగా మీరు ఎందుకు స్లాట్ బుక్ చేసుకున్నారని, మీకు ఎవరు చేశారని ప్రశ్నించి ఇబ్బంది పెట్టినట్లు బాధిత రైతులు తెలపడంతో దిశలో వార్త ప్రచురితమైంది.

ఏసీబీ దాడి నుంచి తప్పించుకున్న తహసీల్దార్

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూర్ మండల తహసీల్దార్ నరేష్ ఇటీవల కొద్దిలో ఏసీబీ అధికారుల దాడుల నుంచి తప్పించుకున్నట్లు తెలిసింది. ఆలూరు మండలంలోని దేగం గ్రామానికి చెందిన బాధిత రైతులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ రెడ్డిల మిత్రుడు ఏసీబీ లో పనిచేస్తున్నట్లు తెలిసింది. ఏసీబీలో పనిచేసే వారి స్నేహితునికి నరేష్ చేసిన తతంగం మొత్తం వీడియో రికార్డును పంపించారు. కానీ తహసీల్దార్ చివరకు పని చేయడం వల్ల ఏసీబీ దాడి నిలిచి పోయిందని తెలిసింది.

Next Story

Most Viewed