విధులు బహిష్కరించిన న్యాయవాదులు

by Sridhar Babu |
విధులు బహిష్కరించిన న్యాయవాదులు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా నిజామాబాద్ లో బుధవారం జిల్లా కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా బాంగ్లాదేశ్ లో జరుగుతున్న ఘటనలను బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. బంగ్లాదేశ్ అరాచకాలపై రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆఫ్ ఫెడరేషన్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు బుధవారం నిజామాబాద్ బార్ అసోసియేషన్ మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అధ్యక్షతన అత్యవసర సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విధులను బహిష్కరిస్తున్నట్టు ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం జిల్లా కోర్ట్ ప్రధాన గేటు ఎదుట న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన ప్రదర్శన చేపట్టారు.

ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ…బంగ్లాదేశ్ లో జరుగుతున్న అరాచకాలపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు రాజకీయ పార్టీలు స్పందించకపోవడం శోచనీయమన్నారు. రిజర్వేషన్ల కోసం ప్రారంభమైన ఉద్యమంలో తీవ్రవాదులు చొరబడి బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించారన్నారు. హిందువులపై ఒక పథ‌కం ప్రకారం దాడులు చేయడాన్ని బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తొందన్నారు. భారత ప్రభుత్వంతో పాటు ఐక్యరాజ్య సమితి కూడా కల్పించుకొని బంగ్లాదేశ్ లో హిందువులకు,

హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాలని కోరారు. నిరాశ్రయులైన హిందువులకు భారత ప్రభుత్వం బాసటగా నిలిచి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యుడు ఎం.రాజేందర్ రెడ్డి, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వసంత్ రావు, సంయుక్త కార్యదర్శి దంపల్ సురేష్, లైబ్రరీ కార్యదర్శి పిల్లి శ్రీకాంత్, న్యాయవాదులు ఆశ నారాయణ, అరెటి నారాయణ, మానిక్ రాజ్, దేవదాస్, పుణ్యరాజ్, బాలాజీ, రావిప్రసాద్, పడిగెల వెంకటేశ్వర్, యెర్రం విఘ్నేష్, తుల గంగాధర్, , బిట్ల‌ రవి, విశ్వక్ సేవ్ మధు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story