- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రిజిస్ట్రేషన్ లో ఆ ఏడుగురి పేర్లెందుకు...?
దిశ, భిక్కనూరు : సంఘం భవనం కోసం కొనుగోలు చేసిన స్థలం రిజిస్ట్రేషన్ విషయంలో కిరాణా అసోసియేషన్ లో నెలకొన్న విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. 1988 సంవత్సరంలో కిరాణా అసోసియేషన్ పేరుతో భిక్కనూరు మండల కేంద్రంలోని పల్లెప్రకృతి వనం సమీపంలో స్థలాన్ని కొనుగోలు చేసి, అప్పటి కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీరాం చంద్ర శేఖర్ గుప్తా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ఉంచారు. అయితే అనారోగ్య సమస్యల కారణంగా, కిరాణా షాపును తీసేశాడు. హైవేకి సమీపంలో ఉండడంతో పెట్రోల్ బంకు కోసం స్థలాన్ని లీజుకిచ్చేందుకు ఇప్పటి కార్యవర్గం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే మొదట్లో ఒకరిద్దరి పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించాలని అనుకున్నారు.
ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి అప్పటి అసోసియేషన్ అధ్యక్షునికి తెలియకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని పథకం రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే వారి వ్యూహం బెడిసి కొట్టడంతో చౌరస్తాలో ఉన్న పాతకిరాణా దుకాణదారులు ఏడుగురు పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించాలని నిర్ణయించారు. దీన్ని అసోసియేషన్ లో ఉన్న మిగతా సభ్యులు అంతర్గతంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. సుమారు 40మంది సభ్యులు ఉన్నఅసోసియేషన్ లో కేవలం ఏడుగురు పేర్ల మీదనే ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించాలని నిర్ణయించడం పట్లతీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై చౌరస్తాలో బుధవారం చౌరస్తాలో అసోసియేషన్ సభ్యుల మధ్య వాగ్వాదం జరగడంతో బజారులో గొడవపడడం కన్నా కూర్చొని మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నారు.