- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధీర వనిత ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలి
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నేటి సమాజంలో మహిళలు చాకలి ఐలమ్మ, రాణిరుద్రమ, ఝాన్సీరాణి వంటి ధీరవనితలను, వారి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వినాయకనగర్ లోని అమరవీరుల పార్క్ వద్ద ఐలమ్మ విగ్రహానికి ఆయన పూల మాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా దొరల పెత్తనంపై ఆమె చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చి వారిని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ స్రవంతి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగోళ్ల లక్ష్మీనారాయణ, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్నాటి కార్తీక్, ఆనంద్, పవన్, కిరణ్, భూమేశ్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.