వ్యవసాయ రంగం అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం

by Sridhar Babu |
వ్యవసాయ రంగం అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం
X

దిశ,నిజాంసాగర్ : వ్యవసాయ రంగం అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆయన బుధవారం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా జెండా మోస్తూ పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్మకంతో ముందుకు నడిపిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పడ్డ కష్టాలు గుర్తుచేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి కొండంత అండగా నిలిచి అధికారం కోసం పని చేసిన కార్యకర్తలకు పూర్తి సహకారం ఉంటుందని అన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలో సోనియా గాంధీ తమ పార్టీ పూర్తిగా కొల్పోతుందని ముందుగానే గ్రహించినా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరిక మేరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు ఇప్పటికీ నిదర్శనంగా నిలిచాయని అన్నారు. అర్హత గల ప్రతి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు,సంక్షేమ పథకాలు అందిస్తామని అన్నారు. ఇప్పటికే 35 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని గుర్తు చేశారు. నిరు పేదలకు 25 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో కౌలాస్, లెండి, నిజాంసాగర్ ప్రాజెక్టుల ద్వారా వేల

ఎకరాలకు సాగు నీరు అందించేందుకు ప్రణాళిక ఏర్పాటు చేసుకుని రైతన్నకు అండగా నిలుస్తామని హామీ నిచ్చారు. బీజేపీ ప్రభుత్వం 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటికీ హామీ నెరవేర్చలేక పోయిందని, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టగానే అది నెరవేరుస్తుందని అన్నారు. అదే విధంగా అంగన్​వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన వర్కర్లకు రెండింతల జీతం పెంచి ఇస్తామని అన్నారు. కుటుంబ పాలన, దొరల పాలనకు తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ప్రజా సామ్యంలో ఓటు అనే ఆయుధంతో అవినీతి పరులను ఏరిపారేయాలని కోరారు. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ సెట్కర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

కార్యకర్తలు అధైర్య పడొద్దు : జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధైర్య పదొద్ధని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. కార్యకర్తలకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తనని సంప్రదించి,లేదా ఫోన్ లో కూడా చెప్పుకోవాలని సూచించారు. మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. పార్టీలో కొత్తవారు వస్తున్నప్పటికీ భయపడొద్దని కోరారు. పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని, ఎవరి స్థానం వారిది అని హామీ ఇచ్చారు.

జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంఛార్జి సెక్రటరీ విష్ణునాథ్, నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, ఉజ్వల్ రెడ్డి, అడ్వైకెట్ రాం రెడ్డి, మైనారిటీ అధ్యక్షులు పాషా బు సెట్, మల్లికార్జున్, రవీందర్ రెడ్డి, అనీస్ పాటిల్, ప్రజా పండరి, నియోజకవర్గంలోని మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed