- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మద్యాన్ని నిషేధిస్తూ గ్రామంలో ఏకగ్రీవ తీర్మానం
దిశా ఎల్లారెడ్డి: మద్యాన్ని నిషేధించి తమ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలపాలని తపన పడుతున్న ఆ గ్రామస్థులంతా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా తమ గ్రామంలో మద్యం విక్రయించినట్లయితే రూ.50 వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుందంటూ అందరూ కలిసి ఏకగ్రీవ తీర్మానం చేశారు. మధ్య నిషేధం చేయడం ఆ గ్రామస్తులు అందరికీ హర్షనీయమని గ్రామస్థులందరూ ఏకతాటిపై తీర్మానం చేసుకున్నారు. ఎల్లారెడ్డి మండలంలోని ఆజామాబాద్ గ్రామం (అంకుల్ పేట) గ్రామంలో మద్యం అమ్మ రాదని, మద్యం అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ గ్రామస్థులందరూ మూకుమ్మడిగా తీర్మానం చేసుకున్నారు. ఈ మేరకు తీర్మాన పత్రాన్ని గ్రామస్థులందరి ముందు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్లొల్ల కిష్టయ్య భాగయ్య, కుమ్మరి సాయన్న, లచ్చారాం, కుమ్మరి చిన్న సాయన్న, లచ్చగౌడ్, యాదగిరి, గాండ్ల రాజు, కుమ్మరి శ్రీను, కుమ్మరి, పండరి, గ్రామ అధ్యక్షులు, గ్రామస్థులు పాల్గొన్నారు.