తహసీల్దార్ గారు మాకు న్యాయం చేయండి ?

by Sumithra |
తహసీల్దార్ గారు మాకు న్యాయం చేయండి ?
X

దిశ, బాన్సువాడ : బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయం ఎదుట మండలంలోని హుమ్నాపూర్ గ్రామానికి చెందిన నీరడి సాయిలు, అతని భార్య రేఖ ఇద్దరు గురువారం దీక్షలకు పూనుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వర్ని మండల వీఆర్ఏల సంఘం అధ్యక్షుని రౌడీయిజం, గుండాయజం సొంత అన్నా వదినల పైనే నడుస్తోందని తెలిపారు. నీరడీ ఈశ్వర్ వల్ల తమకు ప్రాణహాని ఉందని, కాపాడాలంటూ భార్యాభర్తలు ఇద్దరు తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని గురువారం చేపట్టామని తెలిపారు.

తమ పేరుపై ఉన్న భూమిని ఫోర్జరీ సంతకాలతో పట్టాలు చేసుకోవడం విడ్డూరమని వారు తెలిపారు. అదేవిధంగా తాను చేయాల్సిన వీఆర్ఏ పోస్టు కూడా అక్రమంగా మోసం చేసి అనుభవిస్తున్నాడని అన్నారు. తమకు తహసిల్దార్ పై నమ్మకం ఉందని తాసిల్దార్ విట్టల్ తప్పనిసరిగా తమకు న్యాయం చేస్తారని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు తాసిల్దార్ కార్యాలయం ఎదుట కూర్చుని న్యాయం చేసి వీఆర్ఎస్ సంఘం వర్ని మండల అధ్యక్షులు నీరటి ఈశ్వర్ పై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story