- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దాబా వద్ద ఆగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్
దిశ, భిక్కనూరు : అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం సిద్ధ రామేశ్వర నగర్ సమీపంలోని 44వ జాతీయ రహదారి పై ఉన్న శేఖర్ దాబా వద్ద శుక్రవారం రాత్రి కొద్దిసేపు ఆగారు. శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని ఆర్మూర్ సభ ముగించుకుని తిరిగి హైదరాబాద్ వెళుతుండగా అకస్మాత్తుగా దాబా వద్ద తన కాన్వాయిని ఆపారు. ముందుగా సెక్యూరిటీని పంపి హోటల్ పరిసరాలను పరిశీలించారు. ముఖ్యంగా వాష్ రూమ్ లు సరిగా ఉన్నాయా లేవా...? అని తెలుసుకోవడానికి తన వెంట ఉన్న సెక్యూరిటీని ముందుగా పంపించి, వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత కారులో నుంచి కిందికి దిగి దాబాలోకి వెళ్లాడు.
అనంతరం దాబా సిబ్బందికి షేక్ హ్యాండ్ ఇచ్చి సేద తీరారు. ఆ తరువాత హోటల్ సిబ్బంది భుజం తట్టి ఉత్సాహం నింపాడు. హోటల్ మేనేజర్ రాజశేఖర్ ఈ విషయం ఆలస్యంగా గమనించి రాహుల్ గాంధీ వద్దకు వెళ్లే ప్రయత్నం చేయగా నమస్కార్ జీ నమస్కార్ జీ అంటూ నేరుగా కారెక్కి వెళ్లిపోయాడు. అకస్మాత్తుగా రాహుల్ ఎంట్రీ కావడంతో సిబ్బంది ఆగమగమయ్యారు. ఆయన వెంట టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ములుగు శాసన సభ్యురాలు సీతక్క తదితరులు ఉన్నారు.