- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తూ తూ మంత్రంగా బడ్జెట్ సమావేశం..బడ్జెట్ ప్రతులను చింపిన కార్పొరేటర్..
దిశ, నిజామాబాద్ సిటీ : మున్సిపాలిటీ కార్పొరేషన్ 2023-24 బడ్జెట్ సమావేశం నిజామాబాద్ లోని న్యూ అంబేద్కర్ భవన్ లో నగర మేయర్ నీతు కిరణ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ బడ్జెట్లో జిల్లా పెద్ద దవాఖానకు నిధులు కేటాయింపు సరిగా లేదని కాంగ్రెస్ కార్పొరేటర్ గడుగు రోహిత్ అన్నారు. స్మశాన వాటికలను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దటం ఏంటని ఆయన ప్రశ్నించారు. బాధలో ఉన్న ప్రజలను గార్డెన్ లో సంతోషంగా ఎలా గడపమని చెబుతున్నారని కాంగ్రెస్ కార్పొరేటర్ గడుగు రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలు బాధలో దవాఖానకు వెళ్తే అక్కడ వసతులు సరిగా ఉండడం లేదని, అక్కడ ఎలుకలు, కుక్కలు, పందులు, పంది కొక్కులు, పిల్లులకు స్థావరంగ తయారైనదని ఆయన అన్నారు. స్మశాన వాటికలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి గార్డెన్ లు నిర్మించి లాభం లేదని ఆయన అన్నారు. ఈ బడ్జెట్ను తిరస్కరిస్తున్నామని, చేయకూడని ఈ పని చేయడానికి సిగ్గు పడుతున్నమని ఆయన అన్నారు. నిజామాబాద్ ప్రజలపై చిత్త శుద్ధి ఉంటే స్లం ఏరియాలలో సాగునీరు, తాగు నీరు, రోడ్డు వ్యవస్థను బాగు చేసి బీద ప్రజలను అదుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్ మాఫియాను పోత్సహిస్తుందని బడ్జెట్ పత్రాలను చింపి నిరసన వ్యక్తం చేశారు.