కామారెడ్డి కొత్త Master Planపై గందరగోళం..

by Sumithra |   ( Updated:2022-12-13 11:58:19.0  )
కామారెడ్డి కొత్త Master Planపై గందరగోళం..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిన్నమొన్నటి వరకు అవన్నీ నాణ్యమైన పంటలు పండించే పచ్చని పంట పొలాలు. కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూములన్నీ ఇప్పుడు పారిశ్రామిక ప్రాంతాలుగా మారిపోయాయి.. రైతులకు సమాచారం ఇవ్వకుండా.. రాత్రికి రాత్రే ఇండస్ట్రియల్ భూములుగా మారిపోవటంతో వేలాది మంది రైతులు రోడ్డున పడ్డారు.. తమ భూముల పరిరక్షణ కోసం ఆందోళనకు సిద్ధం అయ్యారు. కామారెడ్డీ మాస్టర్ ప్లాన్ పై విలీన గ్రామాల రైతుల, ప్రజల ఆందోళనలు చెందుతున్నారు. కామారెడ్డి పట్టణం విస్తరిస్తుండటంతో నూతన మాస్టర్ ప్లాన్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్దం అయింది. ఇందుకోసం ముసాయిదా బిల్లును కూడా రూపొంచింది. అయితే కామారెడ్డి టౌన్ కొత్త మాస్టర్ ఫ్లాన్ పై గందరగోళం నెలకొంది. మాస్టర్ ఫ్లాన్ పై ముసాయిదా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.

ఇందులో భాగంగా టౌన్ కు సమీపంలో ఉన్న అగ్రీకల్చర్ భూముల ఏరియాను ఇండస్ర్టీయల్ ఏరియాగా ప్రతిపాదించటంపై రైతులు అభ్యంతరం చెబుతున్నారు. మరోపక్క మాస్టర్ ప్లాన్ ముసాయిదా నోటిఫికేషన్ ప్రచారం పై కూడా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కేవలం మ్యాప్ తో ఛౌరస్తాల్లో ప్లేక్సిలు ఏర్పాటు చేసినప్పటికి ఇందులో పూర్తి వివరాలు లేవు. దీంతో తమ విలువైన భుములు కోల్పోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రం ఐనా కామారెడ్డి పట్టణాని సంబంధించి పాత మాస్టర్ ప్లాన్ స్థానంలో కొత్త మాస్టర్ ప్లాన్ అమలు కోసం ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. రాష్ర్ట వ్యాప్తంగా మున్సిపాల్టీల్లో కొత్త మాస్టర్ ప్లాన్ అమలు కోసం ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇందులో భాగంగా కామారెడ్డి టౌన్ కు కొత్త మాస్టర్ ప్లాన్ ను డిల్లీకి చెందిన ఓ సంస్థతో రూపకల్పన చేయించారు. కామారెడ్డి టౌన్ తో పాటు మున్సిపాల్టీలో విలీనమైన 8 గ్రామాలను కలుపుకొని కొత్త ప్లాన్ రూపొందించారు.

ముసాయిదా మాస్టర్ ప్లాన్ స్టేట్ గవర్నమెంట్ జీవో నం. 199 మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ అండ్ ఆర్బన్ డెవలప్మెంట్ తేది. 01.11.2022 ద్వారా అమోదం పొందింది. అయితే దీనిపై విలీన గ్రామాల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టౌన్ విస్తరణ, పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ప్యూచర్ అవసరాలు, ప్లాన్ ప్రకారం డెవలప్మెంట్, మెరుగైన రవాణా వ్యవస్థ, ఇండ్ల నిర్మాణం, రోడ్ల వెడల్పు వంటివి పరిగణలోకి తీసుకొని మాస్టర్ ప్లాన్ కు రూపకల్పన చేయాలి. ఇందులో భాగంగా కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం కామారెడ్డీ పట్టణ విస్తీర్ణం 61.55 చదరపు కిలోమీటర్లు. రెసిడెన్సియల్ ఏరియా 6,806 ఎకరాలు, కమర్షియల్ ఏరియా 557 ఎకరాలు, మల్టీ పర్పస్ 667 ఎకరాలు, గవర్నమెంట్ బిల్డింగ్లు, స్థలాలు 635 ఎకరాలు, రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణం 1,445 ఎకరాలు, ఇండస్ర్టీయల్ ఏరియాగా 1,210 ఎకరాలు ప్రతిపాధించారు.

మాస్టర్ ప్లాన్ లో ఇండస్ర్టీయల్ ఏరియా ప్రతిపాదన పై ఆయా వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. కామారెడ్డీ టౌన్ సమీపంలో విలీన గ్రామాలను ఆనుకొని ఉన్న విలువైన అగ్రికల్చర్ భూముల ఏరియాలను ఇండస్ర్టీయల్ ఏరియాగా ప్రతిపాదించారు. ఇల్చిపూర్, అడ్లూర్, టెకిర్యాల్, అడ్లూర్ ఎల్లారెడ్డీ, పాతరాజంపేటకు సమీపంలో ఇండస్ర్టీయల్ ఏరియాగా చూపారు. పాతమాస్టర్ ప్లాన్ లో కామారెడ్డి టౌన్ లోని సిరిసిల్లా రోడ్డులోని కొంత ఏరియా ఇండస్ర్టీయల్ ఏరియాగా ఉంది. మాస్టర్ ప్లాన్ లో 7 నుంచి 9 శాతం ఏరియాను తప్పని సరిగా ఇండస్ర్టీయల్ ఏరియాగా చూపాల్సి ఉండటంతో టౌన్ విస్తీర్ణంకు అనుగుణంగా ఆయా ఏరియాల్లో 1,210 ఎకరాలను ఇండస్ర్టీయల్ ఏరియాగా ప్రతిపాదించారు.

ఇల్చిపూర్, టెకిర్యాల్ శివారులోని వందలాది ఎకరాల భూములు ఇందులో ఉన్నాయి. ప్రతిపాధించిన భూములతో పాటు, వీటికి అనుకొని ఉన్న భూములకు సంబంధించి మార్కెట్లో విలువ తగ్గనుంది. ఇండస్ర్టీయల్ అవసరాలకు తప్పా ఇతర అవసరాలకు సమస్యలు వస్తాయి. రెసిడెన్సియల్ నిర్మాణాలకు మున్సిపల్ పర్మిషన్ ఇవ్వరు. ఇంటి నిర్మాణానికి బ్యాంక్ లోన్లు రావు. ఈ పరిస్థితుల్లో తమ ఏరియాపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన 300 మందికి పైగా రైతులకు వెయ్యి నుంచి 1,500 ఎకరాల అగ్రీకల్చర్ భూములు ఇల్చిపూర్ శివారులో ఉన్నాయి. ఇప్పుడవి పారిశ్రామిక వాడలుగా ప్రకటించటంతో మున్సిపల్ ఆఫీసులో రైతులు అభ్యంతర పత్రాలు ఇస్తున్నారు.

దేవునిపల్లి నుంచి టెకిర్యాల్ హైవే వరకు 100 పీట్ల రోడ్డు నిర్మాణనికి కొత్త మాస్టర్ ప్లాన్ ముసాయిదాలో ప్రతిపాదనలు చేసారు. దేవునిపల్లి నుంచి లింగాపూర్, టెకిర్యాల్ శివారుల మీదుగా నేషనల్ హైవే వరకు 100 పీట్ల రోడ్డును కొత్తగా ప్రతిపాదించారు. ఈ ఏరియాలో కామారెడ్డికి చెందిన కొందరు బడా లీడర్ల భూములు ఉన్న దృష్ట్యా 100 ఫీట్ల రోడ్లుకు ప్రతిపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే విచిత్రంగా కామారెడ్డి టౌన్ లో మాత్రం పలు రోడ్ల విస్తీర్ణాన్ని కుదించటం స్థానికులకు ఆగ్రహం తెప్పిచ్చింది. మాస్టర్ ప్లాన్ కు సంబంధించి 2 రోజుల క్రితం టౌన్లో ఆయా మ్యాప్ లతో ఆయా చోట్ల ప్లేక్సిలు ఏర్పాటు చేశారు.

ఇందులో పూర్తివివరాలు లేవు కొత్త రోడ్ల నిర్మాణం, 100 పీట్ల రోడ్లు ప్రతిపాదన, పాత టౌన్లో రోడ్ల వెడల్పు వివరాలు ప్లెక్సిల్లో వివరంగా లేవు. ఆఫీసర్లను వివరాలు అగిడినా ఇంకా లిస్టు తయారు చేయాల్సి ఉందని చెబుతున్నారు. ఇల్చిపూర్ శివారులో ఎకరాల అగ్రీకల్చర్ భూమి ఉంది. ఇప్పుడు ఈ ఏరియాను ఇండస్ర్టీయల్ ఏరియాగా చూపెట్టారు. ఈ పరిస్థితుల్లో ప్యూచర్లో తమ భూముల విలువ తగ్గిపోతుంది. అప్పుడు మా పరిస్థితి ఏమిటని ఇల్చాపూర్ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టౌన్ విస్తరిస్తున్న ఏరియాలో ఇండస్ర్టీయల్ ఏరియాగా ప్రతిపాదనతో డెవలప్మెంట్ అగిపోతుందని, ప్లాన్ లో మార్పు చేయాలని మరో రైతు అంటున్నాడు. మాస్టర్ ప్లాన్లో మార్పులు చేయాలి. లేనట్లయితే చాలా మంది రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కొందరు తమ అవసరాల కోసం అమ్ముదామనుకున్న కొనేవాళ్లు రారు. రేట్లు తగ్గిపోతాయని బాదిత గ్రామాల రైతులు అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed