- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ ను వేటాడడానికి కామారెడ్డి నుంచి పోటీ : రేవంత్రెడ్డి
దిశ, మాచారెడ్డి : తెలంగాణలోని కామారెడ్డి నియోజకవర్గంలోని భూములేమవుతాయోనని దేశం మొత్తం కామారెడ్డి వైపే చూస్తోందని టీపీసీసీ చీఫ్ కామారెడ్డి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి రేవంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి నియోజకవర్గం లోని ఉమ్మడి మాచారెడ్డి మండలంలోని రెడ్డి పేట, ఇసాయిపేట, మాచారెడ్డి, ఫర్ది పేట, గ్రామాలలో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాయలేడి రూపంలో ఉన్న కేసీఆర్ ను నమ్మవద్దని, మాస్టర్ ప్లాన్ పేరుతో కామారెడ్డి నియోజకవర్గ లోని పేద రైతుల భూములను కేసీఆర్ చుట్టాలు, బంధువులు ఆగ్గువ సగువకు కొనుగోలు చేయడానికి కేసీఆర్ ఇక్కడ ఎమ్మెల్యే అవతారం ఎత్తుతున్నాడని ఆరోపించారు. గజ్వేల్ చుట్టుపక్కల భూములను రెండు దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉండి ఖతం పట్టాడని, పచ్చగా
ఉన్న కామారెడ్డి భూములపై కన్నేశాడని, అందుకే ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నాడని వివరించారు. గంప గోవర్ధన్ చెప్పినట్టుగా కామారెడ్డి అభివృద్ధి కోసం కేసీఆర్ పోటీ చేయడం లేదని, గంపను కమ్మినట్టే కామారెడ్డి ప్రజలను కూడా గంప కింద కమ్మడానికి వస్తున్నాడు అన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా చేసిన గంప తన పదవిని త్యాగం చేశానని చెప్పడం శుద్ధ అబద్ధం అన్నారు. వార్డు మెంబర్ సీటును కూడా వదులుకోలేని ఈ రోజుల్లో ఎమ్మెల్యే సీటును వదులుకున్నానని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. మరి షబ్బీర్ అలీ ఉండగా నువ్వెందుకు పోటీ చేస్తున్నావ్ అనే అనుమానం మీకు రావచ్చని, కామారెడ్డి నియోజకవర్గ ప్రజలపై పెద్ద పులి దాడి చేస్తుందని పెద్దపులిని పట్టుకొని బంధించే వేటగాడినై రావాలని షబ్బీర్ అలీ కోరిక మేరకు తాను మీ మద్దతు కోసం వచ్చానని చెప్పారు. మీ మద్దతు ఉంటే ఆ పులిని బంధించి బోనులో
పడేస్తానని వివరించారు. కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా అని రైతన్నలను మభ్య పెట్టే మాటలను ఆయన దుయ్యబట్టారు. ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని చెప్పారు. ఉచిత కరెంటు వైఎస్సార్ అమలు చేసిన సమయంలో షబ్బీర్ అలీ విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. రైతులు వారి మాటలను నమ్మి మోసపోవద్దని వివరించారు. ఆయన పోటీ చేయాలనుకుంటే సిద్దిపేట సిరిసిల్ల తో పాటు ఆయన బంధువుల నియోజకవర్గాలలో ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ని ఆరు గ్యారంటీ పథకాలను ఆయన వివరించారు.
- Tags
- revanth reddy