అధికారులు అందుబాటులో ఉండాలి.. కలెక్టర్ ఆశిష్ సాగ్వాన్

by Sumithra |
అధికారులు అందుబాటులో ఉండాలి.. కలెక్టర్ ఆశిష్ సాగ్వాన్
X

దిశ, నిజాంసాగర్ : రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. ఆదివారం నిజాంసాగర్ మండలంలోని నాగమడుగు లోలెవెల్ బ్రిడ్జి పై ఉధృతంగా ప్రవహిస్తుండడంతో దాన్ని పరిశీలించడానికి వచ్చారు. నిజాంసాగర్ మండల పరిధిలోగల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా ఉండే విధంగా అధికారులు ముందస్తుగానే చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

నాగమడుగు ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా నాగమడుగు ఎగువ భాగంలో గల అచ్చంపేట ఇతర గ్రామాల ప్రజలు రాకపోకలు జరగకుండా చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ బిక్షపతిని ఆదేశించారు. పురాతనమైన ఇళ్లలో నివసిస్తున్న వారు జాగ్రత్తగా ఉండాలని అలా నివసిస్తున్న ఇండ్లలో వారిని గుర్తించి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులు తీసుకోవాలన్నారు. ఆయన వెంట మండల తహశీల్దార్ బిక్షపతి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ చందురి అంజయ్య, సీనియర్ అసిస్టెంట్ సాయిరాం తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed