- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఓ చేతిలో బిడ్డ.. మరో చేతిలో మైకు గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ జితేష్ వి పాటిల్
దిశ, కామారెడ్డి: జిల్లా అన్ని రంగాలలో ప్రగతిని సాధించడానికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. 73 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం క్యాంపు కార్యాలయం, కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్యం కోసం పోరాటం సాగించిన అమరవీరులకు జోహార్లు అర్పించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందేలా కృషి చేయాలని సూచించారు.
ఓ చేతిలో బిడ్డ.. మరో చేతిలో మైకు
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ జితేష్ తండ్రి ప్రేమను కనబరిచారు. జెండావిష్కరణ అనంతరం అధికారులు నుద్దేశించి మాట్లాడే సమయంలో పక్కనే ఉన్న తన సతీమణి చేతిలో ఉన్న బిడ్డను తన చేతుల్లోకి తీసుకున్నారు. ఒకచేతిలో బిడ్డను, మరో చేతిలో మైకు పట్టుకుని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, అడిషనల్ ఎస్పీ అన్యోన్య, డిఆర్డీవో వెంకట మాధవరావు, కలెక్టరేట్ ఏవో రవీందర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.