- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Kamareddy: తరుగు విషయంలో ఫిర్యాదుల జోరు
- సివిల్ సప్లై చైర్మన్ సీరియస్
- కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు
- వృద్ధులు, మహిళకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన
- కొనుగోలు కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు
దిశ, తెలంగాణ బ్యూరో: రవాణా, రైస్ మిల్లులలో తరుగు విషయంలో అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ వెల్లడించారు. ఈ వ్యవహారంపై రైస్ మిల్లర్లపై ఆయన సీరియస్ అయ్యారు. కాబట్టి తరుగు విషయంలో కఠినంగా వ్యవహరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని, రైస్ మిల్లును చైర్మన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులు తమ ధాన్యాన్ని వెంటనే రవాణా చేయాలని, మిల్లు టాగింగ్ విషయంలో ఇబ్బందులను తెలియజేయగా అదనంగా ఇంకో మిల్లును ట్యాగ్ చేయవలసిందిగా అధికారులను చైర్మన్ ఆదేశించారు. వెంటనే స్పందించినందుకు స్థానిక రైతులు హర్షం వ్యక్తంచేశారు.
సీఎం ఆదేశానుసారం రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని తెలియజేశారు. మోచ తుఫాను వలన రాబోవు మూడు నాలుగు రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ఇచ్చిన నేపథ్యంలో జిల్లాలోని అడిషనల్ కలెక్టర్లకు, సివిల్ సప్లై అధికారులకు కొనుగోలు ప్రక్రియను ఉదయం తొందరగా, సాయంత్రం ఎక్కువ సమయం కేటాయించాల్సిందిగా చైర్మన్ కోరారు. వృద్ధులు, మహిళా రైతుల ధాన్యాన్ని ప్రాధాన్యమిచ్చి ముందుగా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.
Also Read..