విద్యుత్ షాక్‌తో సిద్దుల గుట్ట ఆలయ కమిటీ చైర్మన్ మృతి..

by Hamsa |
విద్యుత్ షాక్‌తో సిద్దుల గుట్ట ఆలయ కమిటీ చైర్మన్ మృతి..
X

దిశ ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన సుప్రసిద్ధమైన నవనాథ సిద్దుల గుట్ట ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు చంద్రశేఖర్ రెడ్డి (48) విద్యుత్ షాక్‌తో బుధవారం ఉదయం మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్‌కు చెందిన ఏనుగు చంద్రశేఖర్ రెడ్డి ఆయన వ్యవసాయ పంట పొలంలో నీరు పెట్టేందుకు ఉదయం పొలానికి వెళ్ళాడు.

పంట పొలంలో ఏనుగు చంద్రశేఖర్ రెడ్డి విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. బీఆర్ఎస్ నాయకుడు, సిద్దులగుట్ట ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు చంద్రశేఖర్ రెడ్డి మరణ వార్త తెలిసి ఆర్మూర్‌లోని ఆలూరు రోడ్డు ప్రాంతం జనసంద్రంగా మారింది. మృతి చెందిన ఏనుగు చంద్రశేఖర్ రెడ్డి అంత్యక్రియల ప్రోగ్రాంలో ఆర్మూర్ ఎమ్మెల్యే, పియుసి చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్న. జీవన్ రెడ్డి పాల్గొననున్నారు. మృతుడికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed