11 మంది మోటాడి రెడ్డిలపై కుల బహిష్కరణ కేసు

by Sridhar Babu |   ( Updated:2024-01-28 14:56:13.0  )
11 మంది మోటాడి రెడ్డిలపై కుల బహిష్కరణ కేసు
X

దిశ ,నిజాంబాద్ క్రైం : నిజామాబాద్ నగరంలోని బోర్గం (పి) మోటాడి రెడ్డి సంఘం సభ్యులపై కుల బహిష్కరణ కేసు నమోదు అయింది. నగరంలోని నాలుగో టౌన్ పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. సంబంధిత కుల సంఘ సభ్యుడిని ఈనెల 11న 100 సార్లు క్షమాపణలు చెప్పాలని, ముక్కు నేలకు రాయాలని, భారీ జరిమానా చెల్లించాలని తీర్మానించారని బాధితులు తెలిపారు. ఈనెల 23న సంఘ సభ్యులకు క్షమాపణ చెప్పకుండా, జరిమానా చెల్లించినందుకు అతన్ని కుల బహిష్కరణ చేస్తూ

సంఘంలో తీర్మానం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు మోటాడి రెడ్డి సంఘంలోని 11 మంది సభ్యులపై కేసు నమోదు చేసినట్టు నాలుగో టౌన్ ఎస్సై సంజీవ్ తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లాలోని బీడీసీలపై వారి అక్రమాలపై ఉక్కు పాదం మోపుతున్నారు. తొలిసారి ఒక కులం సంఘ సభ్యుడిని కుల బహిష్కరణ చేసి వేధించినందుకు క్రిమినల్ కేసులు నమోదు చేయడం గమనార్హం. అదికూడా నిజామాబాద్ నగరంలో జరగడం విశేషం.

Read More..

సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ బాంబు పెట్టినట్టు కాల్ చేసిన వ్యక్తి అరెస్ట్

Advertisement

Next Story